Surgery Fail: రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ప్రభుత్వ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం ముగ్గురిని బలి తీసుకుంది. ఇబ్రహీంపట్నంలోని సర్కార్ ఏరియా హాస్పిటల్ లో ఈనెల 25వ తేదిన కుటుంబ నియంత్రణ క్యాంపు నిర్వహించారు. 30 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. ఇద్దరు డాక్టర్లు ఆ సర్జరీలు నిర్వహించారు. ఆపరేషన్ తర్వాత మహిళలను ఇళ్లకు పంపించారు. అయితే ఇంటికి వెళ్లిన తర్వాత కుని ఆపరేషన్ జరిగిన ఐదుగురు మహిళలు అనార్యోగానికి గురయ్యారు. వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో బాధితులను చికిత్స కోసం మొదట ఇబ్రహీంపట్నం ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకువచ్చారు.  అయినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో ముగ్గురిని నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇబ్రహీంపట్నం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఇద్దరు మహిళలు, ప్రైవేట్ హాస్పిటల్ లో చేరిన మరో ముగ్గురు ఆదివారం చనిపోయారు. మాడ్గుల మండలం నర్సయపల్లి గ్రామానికి చెందిన 30 ఏళ్ల మమత,  ఇబ్రహీంపట్నం మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన 32 ఏళ్ల సుష్మ, సీతారాం​పేటకు చెందిన మహిళ మృతి చెందింది. మరో ఇద్దరు బాధితులు ఓవైసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగానే ఉందని అక్కడి వైద్యులు చెబుతున్నారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ల నిర్లక్ష్యంతోనే చనిపోయినట్లు మృతుల కుటుంబాలు, బంధువులు ఆరోపిస్తున్నారు.


బాధిత మహిళలు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ​వికటించి చనిపోయిన మహిళ మృతదేహంతో కుటుంబ సభ్యులు ఇబ్రహీంపట్నలోని  ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. నిరసనకారులకు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు మద్దతు తెలిపారు. రెండు గంటల పాటు ప్రధాన రహదారిపై ధర్నా చేయడంతో ఆ రూట్ లో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు నిరసనకారులతో మాట్లాడారు. ఉన్నతాధికారులతో మాట్లాడి బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కుని ఆపరేషన్లు వికటించి ముగ్గురు మహిళలు చనిపోవడం కలకలం రేపుతోంది. 


Read also: JAGAN Mangalagiri: మంగళగిరిలో ప్లాన్ మార్చిన సీఎం జగన్.. నారా లోకేష్ సీటు మార్చుకోవాల్సిందేనా?


Read also: Hardik Pandya: టెన్షన్ వద్దు.. నేను చూసుకుంటా! విన్నింగ్ షాట్ కు ముందు హార్దిక్ పాండ్యా సిగ్నల్  వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి