Hardik Pandya: టెన్షన్ వద్దు.. నేను చూసుకుంటా! విన్నింగ్ షాట్ కు ముందు హార్దిక్ పాండ్యా సిగ్నల్ వీడియో వైరల్

Hardik Pandya: ఆసియా కప్ లో భారత్ బోణి కొట్టింది. హోరాహోరీగా సాగిన తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై విక్టరీ కొట్టింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో సిక్సర్ ను భారత్ ను విజయాన్ని సాధించారు హార్దిక్ పాండ్యా. ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టారు హార్ధిక్ పాండ్యా.

Written by - Srisailam | Last Updated : Aug 29, 2022, 12:55 PM IST
  • పాక్ మ్యాచ్ లో హార్దిక్ ఆల్ రౌండ్ షో
  • సిక్సర్ తో మ్యాచ్ గెలిపించిన పాండ్యా
  • హార్దిక్ పాండ్యా సైగల వీడియో వైరల్
Hardik Pandya: టెన్షన్ వద్దు.. నేను చూసుకుంటా! విన్నింగ్ షాట్ కు ముందు హార్దిక్ పాండ్యా సిగ్నల్  వీడియో వైరల్

Hardik Pandya:  ఆసియా కప్ లో భారత్ బోణి కొట్టింది. హోరాహోరీగా సాగిన తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై విక్టరీ కొట్టింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో సిక్సర్ ను భారత్ ను విజయాన్ని సాధించారు హార్దిక్ పాండ్యా. ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టారు హార్ధిక్ పాండ్యా. మొదట బౌలింగ్ లో అద్బుతంగా రాణించి మూడు వికెట్లు పడగొట్టాడు. నాలుగు ఓవర్లలో కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చిన పాండ్యా.. అత్యంత కీలకమైన రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్ వికెట్లను పడగొట్టాడు. 43 పరుగులు చేసిన రిజ్వాన్ అవుట్ తర్వాతే పాకిస్తాన్ స్కోర్ బోర్డు మందగించింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. తర్వాత బ్యాటింగ్ లో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన హార్దిక్ పాండ్యా 17 బంతుల్లోనే 33 పరుగులు చేశాడు. చివరి ఓవర్ నాలుగో బంతికి సిక్సర్ కొట్టి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. రెండు ఓవర్లలో 21 పరుగులు చేయాల్సిన సమయంలో.. అంత ఒత్తిడిలోనూ 19 ఓవర్ లో మూడు ఫోర్లు కొట్టి మ్యాచ్ ను భారత్ వైపు తిప్పాడు హార్దిక్ పాండ్యా.

పాకిస్తాన్ పై విజయంలో కీ రోలో పోషించిన హార్దిక్ పాండ్యాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు హార్దిక్ ను ఆకాశానికెత్తేస్తున్నారు. ఇక మ్యాచ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలో వైరల్ గా మారాయి. పాకిస్తాన్ ను తక్కువ స్కోరుకు ఆలౌట్‌ చేయడంలో కీలకంగా వ్యవహరించిన హార్దిక్ పాండ్య బౌలింగ్‌ను మెచ్చుకుంటూ కెప్టెన్‌ రోహిత్ శర్మ చేతులు జోడించిన ఫొటో వైరల్‌గా మారింది.

మ్యాచ్  చివరి ఓవర్‌ నరాలు తెగే ఉత్కంఠను రేపింది. ఆరు బంతుల్లో భారత్ కు ఏడు రన్స్ కావాలి. స్పిన్నర్ నవాజ్ వేసిన తొలి బంతికి రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఐదు పరుగులకు ఏడు రన్స్ కావాల్సి వచ్చింది. రెండో బంతికి దినేష్ కార్తీక్ సింగిల్ తీశాడు. మూడో బంతికి హార్దిక్ పాండ్యా రన్ తీయలేకపోయారు. హార్టిక్ కొట్టిన బంతి ఫీల్డర్ చేతికి వెళ్లింది. అయినా నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న కార్తిక్ సింగిల్ కోసం కాల్ ఇచ్చాడు. కాని పాండ్యా వద్దని వారించాడు. ఈ సమయంలో అంతా నేను చూసుకుంటా టెన్షన్ వద్దు అంటూ కార్తిక్ కు హార్దిక్ పాండ్యా సైగ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాను సైగ చేసినట్లుగానే నాలుగో బంతిని ప్రేక్షకుల గ్యాలరీలోకి పంపి.. మరో రెండు బంతులు ఉండగానే భారత్ కు గెలుపు అందించారు హార్ధిక్ పాండ్యా

Read Also: KCR JAIL: కేసీఆర్ కోసం కరీంనగర్ జైలులో గది! పరిశీలించేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలు..

Read Also: Telangana Police Constable : ఓఎంఆర్ షీట్లలో పొరపాట్లు.. కానిస్టేబుల్ పరీక్ష రాసిన అభ్యర్థులకు అలర్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News