Father commits suicide after son's death: ఖమ్మం (Khammam) జిల్లా సత్తుపల్లిలో (Sathuapally) విషాదం చోటు చేసుకుంది. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక ఓ తండ్రి ఆత్మహత్యకు  పాల్పడ్డాడు. కుమారుడి మృతదేహాన్ని ఖననం చేసిన చోటే బలవన్మరణం చెందాడు. ఒకరోజు వ్యవధిలోనే తండ్రీకొడుకులు మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పూర్తి వివరాలను పరిశీలిస్తే... ఖమ్మం (Khammam) జిల్లా కేంద్రంలో రాంబాబు అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. రాంబాబు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతని కుమారుడు సాయి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 14న సాయి అతని స్నేహితుడి బర్త్ డే వేడుకలకు వెళ్లాడు. అక్కడ మిగతా స్నేహితులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నాడు. బర్త్ డే వేడుకల్లో ఏం జరిగిందో తెలియదు కానీ స్కూల్ యాజమాన్యంతో పాటు తల్లిదండ్రులు సాయిని మందలించారు.


అంతేకాదు, స్కూల్ యాజమాన్యం సాయిని వారం రోజుల పాటు స్కూల్ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సాయి ఆత్మహత్యకు (Suicide attempt) యత్నించాడు. మొదట ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తరలించగా.. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 16న సాయి మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామం సత్తుపల్లికి తరలించిన కుటుంబ సభ్యులు... అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు.


ఆ మరుసటిరోజు రాత్రి 11 గంటల సమయంలో రాంబాబు ఇంటి నుంచి బయటకెళ్లాడు. చాలాసేపటి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. రాత్రంతా వెతికినా అతని ఆచూకీ లభించలేదు. ఆ మరుసటిరోజు ఉదయం కూడా రాంబాబు కోసం వెతకగా... కుమారుడిని ఖననం చేసిన ప్రదేశంలోనే ఓ చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక.. అతన్ని ఖననం చేసిన చోటే రాంబాబు ఆత్మహత్యకు (Suicide) పాల్పడ్డాడు. ఒక రోజు వ్యవధిలోనే తండ్రీకొడుకులు ఇలా దూరమవడం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Enjoy Rape Remarks: 'ఎంజాయ్ రేప్' కామెంట్స్‌పై నిర్భయ తల్లి రియాక్షన్...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook