TS Jobs: తెలంగాణ ఆర్థిక శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విద్యా శాఖ, అర్కైవ్స్ విభాగంలో 2 వేల 440 ఉద్యోగాల భర్తీకి అనుమతులు మంజూరు అయ్యాయి. ఇంటర్ విద్యలో 1,392 జూనియర్ లెక్చరర్, 40 లైబ్రేరియన్, 91 పీడీ పోస్టులు భర్తీ చేయనున్నారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్, 14 ఇన్‌స్ట్రక్టర్, 31 లైబ్రేరియన్, 5 మాట్రన్, 25 ఎలక్ట్రీషియన్, 37 పీడీ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కళాశాల విద్యా విభాగంలో 491 లెక్చరర్, 24 లైబ్రేరియన్, 29 ఫిజికల్ డైరెక్టర్, అర్కైవ్స్ విభాగంలో 14 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌ రానుంది. గతకొంతకాలంగా వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఇప్పటికే పోలీస్ శాఖ, గ్రూప్-2, ఇంజనీరింగ్ విభాగాల్లో పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ జరిగింది. త్వరలో పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.


రాష్ట్రవ్యాప్తంగా 90 వేల పోస్టులను భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. 80 వేల పోస్టులను వివిధ బోర్డుల ద్వారా భర్తీ చేస్తామని..మిగిలిన 10 వేల పోస్టులను కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని తెలిపారు. అప్పటి నుంచి దశల వారిగా నోటిఫికేషన్లు వస్తున్నాయి.



Also read:Video Viral: కదులుతున్న రైలులో మంటలు..ప్రయాణికుల పరుగులు..వీడియో వైరల్..!


Also read:Sajjala on Babu: ఆయనో ఫెయిల్యూర్ లీడర్..చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook