Huzurabad Fire Accident: కరీంనగర్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.2 కోట్ల నష్టం
గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం (Huzurabad Fire Accident) సంభవించి కోట్ల రూపాయలలో ఆస్తి నష్టం వాటిల్లింది. అగ్ని మాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హుజూరాబాద్ పట్టణంలో ప్రభుత్వ పథకం మిషన్ భగీరథ ప్రాజెక్టు పరికరాలు ఉంచిన గౌడౌన్‌లో ఈ ప్రమాదం జరిగింది. పరికరాలు ఉన్న గదిలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. కొన్ని నిమిషాల వ్యవధిలో కార్చిచ్చుగా మారి ఆ గౌడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించిటనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ అగ్నిప్రమాదంలో మిషన్ భగీరథ ప్రాకెజ్ట్ పరికరాలు దగ్ధమయ్యాయి. వీటి విలువ దాదాపు రూ.2 కోట్ల వరకూ ఉండవచ్చునని ప్రాజెక్ట్ అధికారులు భావిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. భారీ నష్టాన్ని మిగిల్చిన ఈ అగ్ని ప్రమాదం ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
- Also Read : DOST Registrations: అక్టోబర్ 9న ముగియనున్న తుది గడువు
- Also Read : Cyberabad Commissioner: సజ్జనార్ ఫెవరెట్ క్రికెటర్ ఎవరో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe