కోవిడ్‌పై యుద్ధమంటూ పాట రాసి.. కరోనాతోనే కన్నుమూసిన నిస్సార్
Mohammed Nissar Death | కరోనాపై పోరులో తెలుగువారిలో ఉత్సాహాన్ని నింపేందుకు, జాగృతం చేసేందుకు వైరస్‌పై పాట రాసిన తెలంగాణ ప్రజా నాట్య మండలి గాయకుడు, కవి నిస్సార్ చివరికి మహమ్మారితోనే పోరాడుతూ (Mohammed Nissar Dies) కన్నుమూశాడు.
కరోనాపై పోరులో మరో విషాదం చోటుచేసుకుంది. కరోనాపై పోరులో తెలుగువారిలో ఉత్సాహాన్ని నింపేందుకు, జాగృతం చేసేందుకు వైరస్‌పై పాట రాసిన తెలంగాణ ప్రజా నాట్య మండలి గాయకుడు, కవి మహమ్మద్ నిస్సార్(56) చివరికి మహమ్మారితోనే పోరాడుతూ (Mohammed Nissar Dies) కన్నుమూశాడు. దేశంలో కరోనా మహమ్మారి ప్రబలుతున్న సమయంలో మహమ్మారి మన దరికి రాకుండా తరిమికొట్టాలంటూ.. 'కరోనా నీతో యుద్ధం చేస్తాం మా భారత భూభాగాన' అనే పాటను నిస్సార్ (Mohammed Nissar) రాశారు. శుభవార్త: కరోనా కేసుల కన్నా డిశ్ఛార్జ్‌లే ఎక్కువ!
ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ ఆలపించారు. మార్చి నెల చివరలో విడుదలైన ఈ పాట ప్రజల్లోకి బాగా వెళ్లింది. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు, కరోనా మహమ్మారిపై పోరాటం చేసేందుకు మంచి పాట రాశారని ప్రశంసించారు. అనూహ్యంగా కరోనా బారిన నిస్సార్.. అదే మహమ్మారితోనే పోరాడుతూ మృతి చెందడం పట్ల అభిమానులు, సాహితీవేత్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ నా 4 సినిమాలు రిజెక్ట్ చేశాడు: భన్సాలీ
అసలేం జరిగింది..
యాదాద్రి జిల్లా గుండాలం మండలం సుద్దాలకు చెందిన నిస్సార్ తెలంగాణ ఆర్టీసీలో కంట్రోలర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఫ్యామిలీతో కలిసి జగద్గిరిగుట్టలో నివాసముంటున్నారు. ఆయనకు జ్వరం రావడంతో టెస్టులు చేపించుకోగా కోవిడ్19 పాజిటివ్ తేలింది. మంగళవారం కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లగా నిస్సార్‌ను అడ్మిట్ చేసుకోలేదని ఆర్టీసీ యూనియన్ ఆరోపిస్తోంది.
ఈ క్రమంలో చివరగా గాంధీ ఆసుపత్రికి వెళ్లగా అడ్మిట్ చేసుకున్నారు. అయితే నిన్న నుంచి గాంధీలో చికిత్స పొందుతున్న నిస్సార్ (Singer Nissar) దాదాపు 5 గంటలపాటు వెంటిలేటర్ అందించకపోవడంతో చనిపోయాడని ఆరోపిస్తున్నారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos