ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య (Sushant singh Rajput Suicide) కేసును ముంబై పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో తొలుత 10 మంది వరకు విచారణ చేపట్టి వారి వాంగ్మూలం తీసుకున్నారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali)ని విచారించి, ఆయన స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. Dil Bechara trailer: సుశాంత్ చివరి చిత్రం ట్రైలర్ విడుదల
దర్శకుడు భన్సాలీ 3 గంటల విచారణలో పలు ఆసక్తికర విషయాలు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. నటుడు సుశాంత్‌పై తనకు చాలా నమ్మకం ఉందని, ఈ నేపథ్యంలోనే తాను అతడికి ఒకటి, రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు ఆఫర్ చేసినట్లు పోలీసుల విచారణలో భన్సాలీ వెల్లడించాడు. ఇండియాటూడే ఈ విషయాలు రిపోర్ట్ చేసింది. రామ్‌లీలా(2013), బాజీరావ్ మస్తానీ (2015), పద్మావత్ (2018)తో మరో సినిమాను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఆఫర్ చేసినట్లు సమాచారం. RGV సెక్సీ హీరోయిన్ Apsara Rani హాట్ ఫొటోలు వైరల్
షెడ్యూల్ ఖాళీ లేని కారణంగా సుశాంత్ తన సినిమాలు రిజెక్ట్ చేశాడని విచారణలో భన్సాలీ వెల్లడించాడు. తొలి రెండు సినిమాలు చివరికి రణ్‌వీర్ సింగ్ చేయగా, పద్మావత్ సినిమాలో రాజ్‌పుత్ రాజు రతన్ సింగ్ పాత్రను షాహిద్ కపూర్ పోషించడం తెలిసిందే. ఆ మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. నాలుగో సినిమాను కూడా సుశాంత్‌కు ఆఫర్ అది కూడా వర్కౌట్ కాలేదని భన్సాలీ పేర్కొన్నాడు.
కాగా, 2015వరకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ యశ్ రాజ్ ఫిల్మ్స్ (Yash Raj Films)తో కాంట్రాక్టులో ఉన్నాడు. ఆ బ్యానర్‌లో శుద్ధ్ దేశీ రొమాన్స్ (2013), డిటెక్టివ్ బై ఓంకేష్ భక్షి(2015) సినిమాల్లో సుశాంత్ నటించాడు. మూడో సినిమా శేఖర్ కపూర్ దర్శకత్వంలో పానీ తీశారు. కానీ సినిమా విడుదలకు ఏవో అడ్డంకులు తలెత్తాయని పోలీసుల విచారణలో భన్సాలీ తనకు తెలిసిన విషయాలు వెల్లడించాడు.జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
సుశాంత్ నా 4 సినిమాలు రిజెక్ట్ చేశాడు: భన్సాలీ