అతనిపై చర్యలు తీసుకోండి.. లేదా వీఆర్ఎస్ ఇవ్వండి.. లైంగిక వేధింపులపై సీఎస్‌కు మహిళా అధికారి లేఖ..
Woman Officer Alleges Molestation by Higher Official: అటవీశాఖలో ఓ ఉన్నతాధికారి లైంగిక వేధింపుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మహిళా అధికారి ఒకరు సీఎస్‌కు లేఖ రాశారు.
Woman Officer Alleges Molestation by Higher Official: తెలంగాణలోని ఓ జిల్లా కేంద్రంలో అటవీ శాఖ సూపరిండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా అధికారి.. అదే శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు లేఖ రాశారు. దీనిపై అటవీశాఖ అధికారులకు, మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినా.. తన పలుకుబడిని ఉపయోగించి చర్యలు తీసుకోకుండా అడ్డుకున్నట్లు లేఖలో ఆరోపించారు. ఇకనైనా సదరు ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలని.. లేనిపక్షంలో తనకు వీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించాలని వాపోయారు. ఈ వ్యవహారం ఇప్పుడు అటవీశాఖలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వ్యవహారంపై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖతో పాటు జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు ఆ మహిళా అధికారి తన లేఖలో పేర్కొన్నారు. విచారణ నిమిత్తం మహిళా కమిషన్ ఆ అధికారిని పిలిపించినట్లు తెలిపారు. దీనిపై మహిళా అధికారితో విచారణ జరిపించి నివేదిక అందజేస్తామని చెప్పిన ఆ అధికారి.. అందుకు విరుద్దంగా వ్యవహరించారని పేర్కొన్నారు. మహిళా అధికారికి బదులు తానే స్వయంగా విచారణ జరిపి తప్పుడు నివేదికను రూపొందించారన్నారు. ఆ నివేదికను ఇప్పటివరకూ మహిళా కమిషన్‌కు అందించలేదన్నారు.
నివేదిక నిమిత్తం మహిళా కమిషన్ లేఖ రాసినా అటువైపు నుంచి స్పందన లేకుండా పోయిందన్నారు. దీంతో అతనిపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ పోలీసులకు సూచించినప్పటికీ.. తన పలుకుబడి ఉపయోగించి పోలీసులు చర్యలకు దిగకుండా అడ్డుకున్నాడని ఆరోపించారు. ఈ వ్యవహారం తనను మానసికంగా తీవ్ర క్షోభకు గురిచేస్తోందని.. ఇకనైనా సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను ఆ మహిళా అధికారి కోరారు. లేనిపక్షంలో తనకు వీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించమని విజ్ఞప్తి చేశారు.
Also Read: HEAVY RAINS:తెలంగాణలో కుంభవృష్ణి.. భూపాలపల్లి జిల్లాలో 323 మిల్లిమీటర్ల వర్షం.. వరదలతో జనం అతలాకుతలం
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook