Mla Sticker Issue: మాజీ ఎమ్మెల్యే కారుకు, ఎమ్మెల్యే స్టిక్కర్.. చర్చనీయాంశంగా సుంకే రవిశంకర్ ..
Mla Sticker Issue: గురుకులాల బాటలో భాగంగా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కారుకు ఉన్న ఎమ్మెల్యే చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే అయితే కారుకు స్టిక్కర్ ఉండడం పలువు తప్పబడుతున్నారు.
Mla Sticker Issue: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని బోయినపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పరిశీలించారు..అయితే గురుకుల పాఠశాలలోకి వెళ్లడానికి ముందుగా పోలీసులు అభ్యంతరం తెలిపారు. కొద్ది సేపటికి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్, విద్యార్థి విభాగం నాయకుడు శ్రీకాంత్ గౌడ్‌ను పోలీసులు అనుమతించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గురుకుల పాఠశాలల్లో వేలాది మంది పుడ్ పాయిజన్ గురైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇదే క్రమంలో బీఆర్‌ఎస్ నేతలు గురుగుకులాల బాటకు సిద్ధమయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో 180 నుంచి 200 గురుకులాలు ఉంటే..కేసీఅర్ వచ్చాక బడుగు బలహీనుల కోసం 1029 గురుకుల పాఠశాలలు నెలకొల్పారు..అనాడు ఒక్కో విద్యార్థి పై ఒక లక్షకు పైగా ఖర్చు చేసి నాణ్యమైన పౌష్టికాహారం అందించారు. గతంలో గురుకులాల్లో చదివిన వారు ఎంతో గొప్పగా ఎదిగిగారు. కాంగ్రెస్ వచ్చాక గురుకుల విద్యార్థుల జీవితాలు చిన్న భిన్నం అయ్యాయనీ బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. చాలా మంది ఎదుగుదలకు కారణమైన గురుకులాల్లో పురుగుల అన్నం పెట్టడం ఏంటీ?, మార్పు అంటే విద్యార్థులకి పురుగుల అన్నం పెట్టడమేనా అని ప్రశ్నించారు. విద్యార్థుల జీవితాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతుందనీ బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు.
ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్ అదేనా?
బోయినపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పరిశీలించిన సంగతి తెలిసిందే.. అయితే అయిన ప్రయాణిస్తున్న కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చొప్పదండి ఎమ్మెల్యేగా మేడిపల్లి సత్యం, గెలిచి నేటితో సంవత్సరం గడుస్తున్న, ఆ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కారుకు, ఎమ్మెల్యే స్టిక్కర్ మాత్రం తీయకపోవడం చర్చనీయంశంగా మారింది. గత బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన సుంకే రవిశంకర్.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. బీఆర్ఎస్ తలపెట్టిన గురుకుల బాట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో రావడం ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది.
ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్ అదేనా?