Etela Rajender Resigns to TRS: తెలంగాణ రాజకీయాల్లో ఊహించిన కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల తెలంగాణ కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఉద్యమ నేత నుంచి టీఆర్ఎస్‌లో కీలకనేత స్థాయికి ఎదిగిన ఈటల రాజేందర్ ఎట్టకేలకు 19 ఏళ్ల అనుబంధం తరువాత టీఆర్ఎస్‌తో బంధానికి స్వస్తి పలికారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్ శివారు శామీర్‌పేట నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. సొంత కూతురు కవితకు బీఫామ్ ఇచ్చినా టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైందని గుర్తు చేశారు. తాను మాత్రం టీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చిన ప్రతిసారి విజయం సాధించానని, పార్టీ కోసం నేతగా కాదు కార్యకర్తగా పనిచేశానని Etela Rajender పేర్కొన్నారు. కానీ అలాంటి వ్యక్తినైనా తనను ఓ అనామకుడు ఇచ్చిన ఫిర్యాదుతో రాత్రికి రాత్రే మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడా చివరి కోరిక అడుగుతారని తనకు ఆ అవకాశం కూడా ఇవ్వలేదని మాజీ మంత్రి ఈటల వాపోయారు.  


Also Read: TS EAMCET 2021: తెలంగాణ ఎంసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు, Late Fee లేకుండా అప్లై 


‘తెలంగాణ ఉద్యమం పుణ్యమా అని నేను ఎమ్మెల్యే అయ్యాను. ఉద్యమం కోసం అవసరమైన ప్రతిసారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను. 17 స్థానాల్లో పోటీ చేస్తే టీఆర్ఎస్ గెలిచింది కేవలం 7 స్థానాలు మాత్రమే. అందులో నేనొకడిని. 2009లో మహాకూటమిలో భాగంగా తెలంగాణ (Telangana)లో సగానికి పైగా స్థానాల్లో పోటీచేస్తే మేం గెలిచింది 10 మంది మాత్రమే. ఆనాడు 7 మంది గెలిచినా, రెండోసారి 10 మంది గెలిచినా తల ఎక్కడ పెట్టుకుంటావ్ రాజేంద్రా అని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యలు చేశారు. అయితే మేం ఎన్నిసీట్లు గెలిచినా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గెలుస్తుందని బదులిచ్చానని’ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook