హైదరాబాద్‌: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ శివార్లలోని మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అల్మాస్‌గూడలో కలకలం సృష్టించింది. బుధవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. అపార్ట్‌మెంట్‌లోని మొదటి అంతస్తులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హరీష్ కుటుంబం నివాసం ఉంటోంది. హరీష్‌ కుటుంబ సభ్యులు గత రెండు రోజులుగా బయటికి రాకపోవడం గమనించిన ఇరుగుపొరుగువారు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు అందించిన సమాచారంతో అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకున్న పోలీసులు.. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా నలుగురు విగతజీవులుగా పడి ఉన్నారు. ఇరుగుపొరుగు వారి సహాయంతో మృతులను హరీష్‌, స్వప్న, గిరీష్‌, సువర్ణగా పోలీసులు గుర్తించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : Bill Gates praises PM Modi: ప్రధాని మోదీని ప్రశంసిస్తూ బిల్ గేట్స్ లేఖ


ఆర్థిక ఇబ్బందులే హరీష్ కుటుంబం ఆత్మహత్యకు కారణమై ఉంటుందని ఇరుగుపొరుగు వారు అనుమానం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. అసలు కారణం ఏమై ఉంటుందా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..