Bill Gates praises PM Modi: ప్రధాని మోదీని ప్రశంసిస్తూ బిల్ గేట్స్ లేఖ

భారత్‌లో కరోనా వైరస్‌ను నియంత్రించే దిశగా సరైన చర్యలు తీసుకుంటున్నారని ప్రశంసిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి టెక్నాలజీ దిగ్గజం, మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ బుధవారం ఓ లేఖ రాశారు.

Last Updated : Apr 22, 2020, 10:55 PM IST
Bill Gates praises PM Modi: ప్రధాని మోదీని ప్రశంసిస్తూ బిల్ గేట్స్ లేఖ

ఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ను నియంత్రించే దిశగా సరైన చర్యలు తీసుకుంటున్నారని ప్రశంసిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి టెక్నాలజీ దిగ్గజం, మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ బుధవారం ఓ లేఖ రాశారు. ప్రధాని మోదీ ముందు జాగ్రత్తతో చేపట్టిన లాక్ డౌన్, ఐసోలేషన్, హాట్ స్పాట్స్ గుర్తింపు, క్వారంటైన్ వంటి చర్యల వల్లే భారత్‌లో కరోనా ప్రభావం తగ్గిందని బిల్ గేట్స్ ఆ లేఖలో పేర్కొన్నారు. Also read : 20 వేలు దాటిన కరోనా కేసులు.. 652కి చేరిన మృతుల సంఖ్య

 

 

 

 

 

 

 

 

 

 

 

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రధాని మోదీ తీసుకుంటున్న చర్యలను ఆయన తన లేఖలో ప్రస్తావించారు. కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కేంద్రం ఆరోగ్యసేతు యాప్‌‌ను లాంచ్ చేయడం అనేది హర్షించదగిన విషయం అని అభినందించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News