Car Accident in Karminagar: తెలంగాణలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున కారు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న గుడిసెల్లోకి దూసుకెళ్లిన ఘటనలో (Car Accident in Karminagar) నలుగురు దుర్మరణం చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం కరీంనగర్ పట్టణంలో జరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి (Karimnagar Government Hospital) తరలించారు. ఘటనాస్థలిలోనే ఒకరు మృతి చెందగా...హాస్పిటల్ చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. మృతి చెందిన వారిని ఫరియాద్, సునీత, లలిత, జ్యోతిలుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారును వదిలేసి నలుగురు యువకులు పరారయ్యారు. కారుపై 9 ఓవర్‌ స్పీడ్‌ చలాన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


బైక్ ను ఢీకొట్టిన లారీ...ఇద్దరు మృతి
మరోవైపు వికారాబాద్ జిల్లా (Vikarabad District) పరిగి మండలం తొండపల్లి శివారులో బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో (Road Accident) ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని...క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు కావలి సుభాని, గుర్రంపల్లి కృష్ణయ్యగా గుర్తించారు.


Also Read: Hyderabad Sex racket: హైదరాబాద్​లో మరో సెక్స్​ రాకెట్​- గెస్ట్​ హౌస్​లో దందా!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook