Agrigold case: అగ్రి గోల్డ్ నిందితులకు 14 రోజుల రిమాండ్
Agrigold case: అగ్రిగోల్డ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
Agrigold case: అగ్రి గోల్డ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
తెలుగు రాష్ట్ర ప్రజల్ని ముంచేసిన అగ్రి గోల్డ్ కేసు ( Agrigold case ) ఈడీ కోర్టు ( ED Court ) కు చేరింది. కేసులో నిందితులైన అవ్వాస్ వెంకట రామారావు, శేషు నారాయణ, వర ప్రసాద్‌లను ఈడీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించి..చెంచల్‌గూడ జైలుకు పంపించింది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ), తెలంగాణ ( Telangana ) , కర్నాటక ( Karnataka ) రాష్ట్రాల్లో నమోదైన కేసుల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ( ED ) దర్యాప్తు వేగవంతం చేసింది. దాదాపు 32 లక్షల మందిని 6 వేల 380 కోట్ల మేర మోసం చేసినట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారు. 942 కోట్ల డిపాజిటర్ల సొమ్మును ఇతర వ్యాపారాలకు మళ్లించినట్టు ఈడీ గుర్తించింది. అగ్రిగోల్డ్ విషయంలో ఈడీ ఇంతకు ముందు నిర్వహించిన సోదాల్లో 22 లక్షల నగదుతో పాటు కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనమయ్యాయి.
Also read: Telangana: రైతుబంధు పథకం వద్దా మీకు..మీ కోసమే ఈ గివ్ ఇట్ అప్ సౌకర్యం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter