Telangana: రైతుబంధు పథకం వద్దా మీకు..మీ కోసమే ఈ గివ్ ఇట్ అప్ సౌకర్యం

Telangana: అన్నదాతల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పధకం రైతుబంధు. పథకాన్ని స్వచ్ఛందంగా వదులుకునే సౌకర్యాన్ని కల్పించింది  తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు..

Last Updated : Jan 4, 2021, 10:08 PM IST
Telangana: రైతుబంధు పథకం వద్దా మీకు..మీ కోసమే ఈ గివ్ ఇట్ అప్ సౌకర్యం

Telangana: అన్నదాతల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పధకం రైతుబంధు. పథకాన్ని స్వచ్ఛందంగా వదులుకునే సౌకర్యాన్ని కల్పించింది  తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు..

రైతులకు చేయూతగా తెలంగాణ ప్రభుత్వం ( Telangana Government ) రైతుబంధు పథకం కింద ఆర్ధిక సహాయం అందిస్తోంది. ఇప్పుడీ పథకాన్ని స్వచ్ఛందంగా వదులుకునే సౌకర్యాన్ని కల్పించింది. దీనికోసం గివ్ ఇట్ అప్ ఆప్షన్ ప్రవేశపెట్టింది. వ్యవసాయ విస్తీర్ణాధికారులకు గివ్ ఇట్ అప్ ఫారం పూర్తి చేసిన వివరాలు అందించవచ్చని సూచించింది. ఏ రైతులైతే రైతుబంధు ( Rythubandhu ) వదులుకోదలిచారో..వారికోసం గివ్ ఇట్ అప్ అవకాశమని స్పష్టం చేసింది.

2020లో పొందిన డబ్బుల్ని సైతం తిరిగివ్వాలనుకుంటే..గివ్ ఇట్ అప్ ( Give it up ) పత్రాన్ని పూర్తి చేసి..చెక్కు లేదా డిడి ద్వారా తిరిగి అప్పగించవచ్చు. సంబంధిత అధికారులు వాటిని రైతుబంధు సమితికి..వ్యవసాయ శాఖ కమీషనర్, డైరెక్టర్‌లకు పంపిస్తారు. భవిష్యత్తులో తిరిగి కావాలనుకుంటే మళ్ళీ పొందగలిగే విధంగా పోర్టల్‌లో అవకాశం కల్పించారు. 

Also read: Donthi Madhava Reddy: మాజీ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

Trending News