Free Bus Journey in Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే ఆరు గ్యారంటీల అమలుకు ప్రాధాన్యం ఇస్తోంది. సీఎం కేసీఆర్ రేవంత్ రెడ్డి మొదటి సంతకం కూడా ఆరు గ్యారంటీలపైనే పెట్టారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో ఒకటైన 'మహాలక్ష్మి' పథకం. ఈ స్కీమ్‌లో భాగంగా తెలంగాణకు చెందిన మహిళలు, ఆడపిల్లలు, ట్రాన్స్ జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్ర మొత్తం ఉచితంగా ప్రయాణించవచ్చని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ మాటను నిలబెట్టుకుంటూ రేపటి నుంచే ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు విధివిధానాలపై తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనివారం నుంచి మహిళలు, ఆడపిల్లలు, ట్రాన్స్ జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రమంతా ఉచితంగా ప్రయాణించవచ్చని వెల్లడించింది. రేపటి నుంచి ఈ స్కీమ్ అమల్లోకి వస్తుందని ప్రకటించింది. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని తెలిపింది. బస్సుల్లో ఎక్కిన మహిళలు తప్పనిసరిగా ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుందని పేర్కొంది. మహిళా ప్రయాణికుల ఛార్జీని మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఆర్టీసీకి చెల్లించనుంది.


పూర్తి గైడ్‌లైన్స్ ఇలా..


==> పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం
==> డిసెంబర్ 9వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు
==> ఇతర రాష్ట్రాల సరిహద్దు వరకు ఫ్రీ బస్ సర్వీస్‌లు అందుబాటులోకి
==> వయసుతో సంబంధం లేకుండా ఈ స్కీమ్ వర్తింపు
==> మొదటి వారం రోజుల పాటు ఎలాంటి ప్రూఫ్ లేకుండా ప్రయాణం
==> RTC కి ప్రభుత్వం రీఎంంబర్స్‌మెంట్ చేస్తుంది.
==> శనివారం అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారు. 
==> ఈ స్కీమ్‌ కోసం ఏడాదికి రూ.3 వేల కోట్లు అవుతుందని అంచనా.. 


ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. రేపటి నుంచి ఏదైనా ఐడీ కార్డు చూపించి మహిళలు ప్రయాణించవచ్చని చెప్పారు. లిమిట్స్ ఏమి ఉండవని.. ఎక్కడ నుంచైనా ఎక్కడికైనా వెళ్లవచ్చన్నారు. జీరో టికెట్‌ను ఇష్యూ చేస్తారని.. అప్పటివరకు ఎవరిని కూడా ఒక్క పైసా కూడా అడగరని చెప్పారు. ఎంత మంది ప్రయాణిస్తున్నారో ఈ 4, 5 రోజుల్లో ఒక అంచనా వస్తుందన్నారు. ఈ స్కీమ్‌పై అధికారులకు అవగాహన కల్పించామని.. ప్రయాణికులతో వినయంగా మర్యాద పూర్వకంగా మెలగాలని సూచించారు. మొత్తం 7,290 బస్సులను ఈ స్కీమ్‌కు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. మరో 500 ఎలక్ట్రిక్ బస్సులు కూడా రాబోతున్నాయన్నారు.


రాష్ట్రంలో 45 లక్షల మంది ప్రయాణిస్తున్నాని.. మొదట్లో కొన్ని ఏమైనా సమస్యలు వస్తే తొందర్లో పరిష్కరించుకోవచ్చన్నారు. టూర్స్‌కు, తీర్థయాత్రలకు ఒకేసారి వెళ్లే వారికి ఈ స్కీమ్ వర్తించదన్నారు. ఈ పథకం అమలుతో ఎలాంటి ఛార్జీలు పెంచమన్నారు. పాత ప్రభుత్వంలో కొంత బకాయిలు రావాల్సి ఉందని.. జీవన్ రెడ్డి నుంచి రూ.7.50 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. అవసరమైన చోట పురుషులకు స్పెషల్ బస్సులను నడిపిస్తామన్నారు. మహిళల బస్‌పాస్‌లు రేపటి నుంచి పనిచేయవన్నారు. 


Also Read:  New Ministers History: తెలంగాణా కొత్త మంత్రుల పూర్తి హిస్టరీ..రాజకీయ అరంగేట్రం వివరాలు..


Also Read:  CM Revanth Reddy: కొత్త ప్రభుత్వంలో ప్రక్షాళన.. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి