Safran Group Investing in Hyderabad: తెలంగాణ సిగలో మరో ప్రఖ్యాత సంస్థ పెట్టుబడులు పెడుతోంది. ఫ్రాన్స్‌కు చెందిన విమానయాన రంగ ఉత్పత్తుల తయారీలో దిగ్గజ సంస్థ అయిన శాఫ్రాన్‌ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యింది. దాదాపు 1200 కోట్ల రూపాయల విలువైన యూనిట్‌ నెలకొల్పనుంది. ఆ యూనిట్‌ ఓపెన్‌ అయితే, వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అవును.. శాఫ్రాన్‌ తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఓకే చెప్పింది. శాఫ్రాన్‌ సంస్థ తన మెయింటెనెన్స్‌, రిపేర్‌, ఓవర్‌హాల్‌ కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేయనుంది. 150 మిలియన్స్ అమెరికన్‌ డాలర్లు దీనికోసం ఖర్చు చేయనుంది. విమాన ఇంజన్ల నిర్వహణ, మరమ్మత్తు కేంద్రాన్ని శాఫ్రాన్‌ సంస్థ హైదరాబాద్‌ శివారులో నెలకొల్పనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కేంద్రం హైదరాబాద్‌లో నెలకొల్పితే భారతదేశంలోనే శాఫ్రాన్‌కు చెందిన తొలి ఎమ్మార్వో కేంద్రంగా రికార్డు సృష్టించనుంది. శాఫ్రాన్‌ సంస్థ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ స్వాగతించారు. విదేశాలకు చెందిన ఓ ప్రముఖ సంస్థ మన దేశంలో పెట్టుబడులు పెడుతున్న తొలి విమాన ఇంజన్ల నిర్వహణ కేంద్రం ఇదే అవుతుందన్నారు కేటీఆర్‌. శాఫ్రాన్‌ సంస్థ పౌర, సైనిక విమానాల కోసం అత్యాధునిక ఇంజన్లు ఉత్పత్తి చేసే ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థల్లో ఒకటి. 



శాఫ్రాన్‌ సంస్థ హైదరాబాద్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే.. ఇకపై వాణిజ్య విమానాల్లో వాడే లీప్‌-1ఎ, లీప్‌-1బి ఇంజన్ల మెయింటెనెన్స్‌ హైదరాబాద్‌లోనే చేసే అవకాశం ఉంటుందని కేటీఆర్‌ (Minister KTR) తెలిపారు. శాఫ్రాన్‌ ఎంఆర్‌ఓ కేంద్రం హైదరాబాద్‌లో ఏర్పాటైతే తెలంగాణలోని విమానయాన రంగ పరిశ్రమకు మరింత ఊతం లభిస్తుందన్నారు.


Also read : Corona Updates in Telangana: తెలంగాణలో వైరస్ వర్రీ..తాజాగా కరోనా కేసులు ఎన్నంటే


Also read : PM Modi: పోరు గడ్డ నుంచి రూట్‌ మార్చిన పీఎం మోదీ..రాజకీయాలు లేకుండా ప్రసంగం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook