CBSE Board Exam 2024: రేపటి నుంచే సీబీఎస్ఈ బోర్డ్ పరీక్షలు.. ఈ ముఖ్యమైన మార్గదర్శకాలను గుర్తుంచుకోండి..
CBSE Board Exams Guidlines: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 2014 ఫిబ్రవరి 15 నుంచి 10, 12వ తరగతి పరీక్షలను ప్రారంభించబోతోంది. సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులు మొదటి రోజు ఎంట్రప్రెన్యూర్‌షిప్, కోక్‌బోరోక్, క్యాపిటల్ మార్కెట్ ఆపరేషన్స్ ,ఫిజికల్ యాక్టివిటీ ఇన్‌స్ట్రక్టర్ పరీక్షకు హాజరవుతారు.
CBSE Board Exams Guidlines: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 2014 ఫిబ్రవరి 15 నుంచి 10, 12వ తరగతి పరీక్షలను ప్రారంభించబోతోంది. సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులు మొదటి రోజు ఎంట్రప్రెన్యూర్‌షిప్, కోక్‌బోరోక్, క్యాపిటల్ మార్కెట్ ఆపరేషన్స్ ,ఫిజికల్ యాక్టివిటీ ఇన్‌స్ట్రక్టర్ పరీక్షకు హాజరవుతారు. కాగా, 10వ తరగతి విద్యార్థులు మొదటి రోజు పెయింటింగ్ గురుంగ్, రాయ్, తమాంగ్, షెర్పా పరీక్షకు హాజరుకానున్నారు.విద్యార్థులు తప్పనిసరిగా CBSE అడ్మిట్ కార్డును పరీక్ష హాల్‌కు తీసుకెళ్లాలి, ఎందుకంటే అది లేకుండా ఏ విద్యార్థి పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతించరు.
తప్పుడు వార్తలు..
పేపర్ లీక్‌కు సంబంధించి నకిలీ సమాచారం, ధృవీకరించని వార్తలకు వ్యతిరేకంగా CBSE బోర్డు తల్లిదండ్రులు , విద్యార్థులను హెచ్చరించింది. విద్యార్థులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దు.
ఇదీ చదవండి: భక్తులకు 6 షిఫ్టుల్లో బాలరాముని దర్శనం.. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పాసులు..
CBSE బోర్డు పరీక్షా సమయం:
సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు నిర్వహించనున్నారు. అయితే, కొన్ని పరీక్షలు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహిస్తారు. 10వ తరగతి పరీక్షలు 2024 ఫిబ్రవరి 15 నుండి మార్చి 13 వరకు నిర్వహించనున్నారు. 12వ తరగతి పరీక్షలు 2024 ఫిబ్రవరి 15 నుండి ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి..
ఇదీ చదవండి: ప్రతినెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్.. కొత్త పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ..
CBSE తరగతి 10, 12 పరీక్ష రోజు సూచనలు:
విద్యార్థులు పరీక్ష సమయానికి కనీసం 30 నిమిషాల ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.
CBSE అడ్మిట్ కార్డ్ లేకుండా ఏ విద్యార్థి పరీక్షకు అనుమతించబడరు. కాబట్టి అడ్మిట్ కార్డును తీసుకెళ్లడం మర్చిపోవద్దు.
పరీక్ష గదిలో వస్తువులను పంచుకోవడం అనుమతించరు. కాబట్టి మీ స్వంత స్టేషనరీని తీసుకురండి.
ఎలాంటి అనధికార మెటీరియల్‌ని తీసుకురావద్దు.
ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాన్ని తీసుకురాకూడదు. పరీక్షను ఎప్పుడైనా రద్దు చేసే హక్కు బోర్డుకి ఉందని అర్థం చేసుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి