కరోనాకు భయపడి చస్తున్నా ఇంత నిర్లక్ష్యమా?
చైనాలో ఇప్పటికే ప్రాణాంతక కరోనా వైరస్ కారణంగా 2000 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లోనూ కరోనా మరణాలు నమోదయ్యాయి.
హైదరాబాద్: ఓవైపు ప్రాణాంతక కరోనా వైరస్ (కోవిడ్ 19) ఎక్కడ తమకు సోకుతుందేమోనని నగరవాసులతో పాటు రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతారు. మరోవైపు ఆసుపత్రులలో షేపెంట్లకు చికిత్స అందించడంలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడుతోంది. నగరంలోని గాంధీ ఆస్పత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం పేషెంట్లను భయబ్రాంతులకు గురిచేస్తోంది. స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఓవ్యక్తి గాంధీ ఆసుపత్రిలో చేరాడు. అయితే సాధారణ ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న పేషెంట్ల మధ్యలో స్వైన్ ఫ్లూ పేషెంట్‌కు ఆసుపత్రి సిబ్బంది బెడ్ కేటాయించారు.
Also Read: వైరస్‌ను కనుగొన్న డాక్టర్‌నే బలిగొన్న కరోనా
అసలే కరోనా లాంటి వైరస్‌లు వ్యాప్తి చెందుతున్న సమయంలో హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ పేషెంట్లు భయాందోళనకు గురవుతున్నారు. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా, కనీసం మాస్క్ లు కూడా అందుబాటులో ఉంచకుండా బెడ్ ఎలా కేటాయించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్థరాత్రి నుంచి ఆసుపత్రి వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది లేక పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది.
See Pics: అందాల గేట్లు ఎత్తేసిన భామలు
Also Read: చైనాలో మరో విషాదం.. కీలక వ్యక్తిని బలిగొన్న కరోనా వైరస్