Ghmc commissioner Amrapali orders to Apartment residence: హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టాక ఆమ్రాపాలీ తనదైన శైలీలో దూసుకుపోతున్నారు. హైదరాబాద్ లో ఇటీవల అనేక విషయాలపై కూడా కొరడా ఝుళిపించారు. చెరువుల కబ్జా, పార్కింగ్ లలో అధికవసూళ్లు, పుట్ పాత్ ల కబ్జాల వంటి అనేక అంశాలపై ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. ఒకవైపు అధికారులతో సమన్వయం చేసుకుంటునే, మరోవైపు స్వయంతో తానే.. రంగంలోకి దిగి పలుప్రాంతాలను డైరెక్ట్ గా సందర్శిస్తున్నారు. హైదరాబాద్ ప్రజలను స్థానిక సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు.  ఇదిలా ఉండగా.. కొన్నిరోజులుగా అనేక అపార్ట్ మెంట్లలో జీహెచ్ఎంసీ సిబ్బంది చెత్తలను తీసుకెళ్లడంలేదని కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై కమిషనర్ స్పందించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాకుండా.. అపార్ట్ మెంట్ వాసులకు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశారు. అపార్ట్ మెంట్ లో చెత్తనంతా.. ఒక చోట చేర్చే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.కొన్నిసార్లు ప్రతిడోర్ టూ డోర్ రావడం వల్ల సమయం, సిబ్బంది కొరత ఏర్పడవచ్చు.దీన్ని నివారించడానికి అపార్ట్ మెంట్లలో చెత్తను ఒకేచోట ఉంచితే.. బల్దియా స్వచ్చకార్మికులు వచ్చి, చెత్తను తీసుకెళ్తారని కమిషనర్ సూచించారు. దీంతో సమయంతోపాటు, తక్కువ మంది సిబ్బందితో తొందరగా పనౌతుందని ఆమ్రాపాలీ వెల్లడించారు. 


ఇదిలా ఉండగా.. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు నగర జీవనమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. అనేక ప్రాంతాలలో రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి. మ్యాన్ హోల్స్ లవద్ద చెత్తను ఆగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.  మరోవైపు హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ అధికారులు జియో ట్యాగింగ్ కార్యక్రమంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. జియో సర్వే వల్ల.. లోకేషన్ ఎగ్జాక్ట్ గా ఐడెంటిఫికేషన్ చేయోచ్చని ఆమ్రాపాలి చెప్పుకొచ్చారు.


Read more: Viral Video: రూ. 1000 ఇచ్చి మరీ భార్యతో పాలు తాగించిన భర్త.. అసలు విషయం తెలిస్తే పగలబడి నవ్వడం ఖాయం..


 ఇదిలా ఉండగా.. జీహెచ్ఎంసీ అధికారులు నీటి బిల్లులు, విద్యుత్ బిల్లులు, భవన నిర్మాణ అనుమతులు మొదలైన వాటిగురించి తెలుసుకుంటారని చెప్పారు.  ప్రజలు కూడా అధికారులకు సహాకరిస్తున్నారు.  ఇటీవల ఈ వ్యవహరంలో కూడా ఆమ్రాపాలీ వ్యక్తిగత వివరాలు, ఆధార్ కార్డు వంటివి మాత్రం చెప్పాల్సిన అవసరంలేదంటూ కూడా స్పష్టం చేశారు. ఈ క్రమంలో జియో ట్యాగింగ్ వల్ల కూడా అనేక ఉఫయోగాలు ఉన్నాయని కమిషనర్ అన్నారు. దీనిలో భాగంగా.. హైదరాబాద్ లోన ప్రజలకు ఆధార్ కార్డు మాదిరిగా ప్రత్యేకంగా ఒక నెంబర్ కేటాయిస్తామన్నారు. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter