GHMC Elections: ఓల్డ్ మలక్‌పేటలో రీ పోలింగ్.. ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ (GHMC Polling ) ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఓటింగ్ చాలా మందకొడిగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 8.90 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Greater Hyderabad Elections 2020: హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ (GHMC Polling ) ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఓటింగ్ చాలా మందకొడిగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 8.90 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఓల్డ్ మలక్‌పేట డివిజన్లో రీ పోలింగ్ జరగనుంది. అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు తారుమారు కావడంతో అక్కడ పోలింగ్‌ను రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆ డివిజన్‌లో ఉన్న 69 పోలింగ్ కేంద్రాల్లో డిసెంబరు 3న (గురువారం) రీ పోలింగ్ ( re polling to be held in old malakpet) ఉంటుందని ఎన్నికల కమిషన్ పేర్కొంది. Also read: ID Cards For Voting: ఓటరు కార్డు లేకున్నా ఈ ఐడీ కార్డులు చూపించి ఓటేయవచ్చు
ఓల్డ్ మలక్‌పేట డివిజన్‌లో సీపీఐ, సీపీఎం అభ్యర్థుల పార్టీల గుర్తులు తారుమారయ్యాయి. బ్యాలెట్ పత్రంలో సీపీఐ అభ్యర్థి పేరు ఎదురుగా సీపీఎం గుర్తును ముద్రించారు. దీంతో ఈ ప్రాంతంలో పోలింగ్ నిలిపివేయాలంటూ సీపీఐ నేతలు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం ఓల్డ్ మలక్‌పేటలోని కేంద్రాల్లో పోలింగ్‌ను నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం..
హైదరాబాద్ ( Hydearabad ) మలక్‌పేట డివిజన్లో రీ పోలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత రావాల్సిన ఎగ్జిట్ పోల్స్‌ను కూడా నిషేధించినట్లు ఎస్ఈసీ పార్థసారధి వెల్లడించారు. దీంతో రీపోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్లడికానున్నాయి.
Also Read | Ballot Voting Process: బ్యాలెట్ పేపర్‌తో ఓటు వేయడం ఎలా ? పూర్తి వివరాలు చదవండి!
Also Read | Covid-19 సమయంలో ఓటు వేసేటప్పుడు తీసుకోవాల్సిన 10 జాగ్రత్తలు ఇవే!
Also Read | GHMC App లో పోలింగ్ సెంటర్, బూత్ వివరాలు సులభంగా తెలుసుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe