Hyderabad Rains: నగరంలో ఎటుచూసినా నీరే.. హెల్ప్ లైన్ నెంబర్ల జారీ
తెలంగాణ రాజధాని హైదరాబాద్ కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలమైంది. రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో నగరం జలమయమయింది. రహదారులు, కాలనీలన్నీ వరద నీటితో దర్శనమిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వరద నీరు వచ్చిచేరింది.
GHMC-NDRF officials announce helpline numbers in Hyderabad: హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad) కురుస్తున్న భారీ వర్షాలతో (heavy rains) అతలాకుతలమైంది. రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో నగరం జలమయమయింది. రహదారులు, కాలనీలన్నీ వరద నీటితో దర్శనమిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వరద నీరు వచ్చిచేరింది. ఇప్పటికే హైదరాబాద్ నగరానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఎటుచూసినా వరదప్రవాహంతో జనజీవనం అస్తవస్తంగా మారింది. దీంతో నగరవాసులు భయాందోళనలోనే గాఢ అంధకారంలో రాత్రంతా బిక్కుబిక్కుమంటూ ఇళ్లల్లోనే గడిపారు. ఇప్పటికే చాలా వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. అయితే మరో రెండు, మూడురోజులపాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలను కోరారు. ఈ మేరకు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు పలు సలహాలు సూచనలు ఇస్తున్నారు. వరదలతో ఇళ్లు కూలి ఇప్పటికే పాతబస్తీలో 9మంది మరణించిన సంగతి తెలిసిందే.
హెల్ప్ లైన్ నెంబర్లు ఇవే.. (helpline numbers)
అయితే మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముండటంతో.. ప్రభుత్వం అత్యవసర సేవల నెంబర్లను (helpline numbers) జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే సేవలందించేందుకు జీహెచ్‌ఎంసీ (GHMC), ఎన్డీఆర్‌ఎఫ్, విపత్తు నిర్వహణ సిబ్బంది అందుబాటులో ఉంటారని అధికారులు వెల్లడించారు. అత్యవసర సేవల కోసం ప్రజలు 040-211111111 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. విపత్తు నిర్వహణశాఖ నంబర్ 9000113667, చెట్ల తొలగింపు సిబ్బంది నంబర్ 6309062583, విద్యుత్ శాఖ నంబర్ 9440813750, ఎన్డీఆర్‌ఎఫ్ నంబర్ 8333068536, డీఆర్‌ఎఫ్ నంబర్ 040-29555500, ఎంసీహెచ్ విపత్తు నిర్వహణశాఖ నంబర్ 9704601866లకు ఫోన్ చేయాలని కోరారు. ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప మూడురోజుల పాటు బయటకు రావొద్దంటూ హెచ్చరికను విడుదల చేశారు. Also read: Hyderabad Rains: ఇళ్లు కూలి 8మంది మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe