Hyderabad Rains: ఇళ్లు కూలి 8మంది మృతి

ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలు తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో పాతబస్తీ చాంద్రాయణగుట్ట పరిధి గౌస్‌నగర్‌ బండ్లగూడ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

Last Updated : Oct 14, 2020, 02:39 AM IST
Hyderabad Rains: ఇళ్లు కూలి 8మంది మృతి

8 people Died at Hyderabad due to heavy rains: హైదరాబాద్‌: ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలు తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad) నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో పాతబస్తీ చాంద్రాయణగుట్ట పరిధి గౌస్‌నగర్‌ బండ్లగూడ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు రెండు ఇళ్లు కూలిపోవడంతో ఓ చిన్నారితో సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే గాయపడిన వారిని ఓవైసీ ఆసుపత్రికి తరలించారు. అయితే సంఘటనా స్థలానికి పోలీసులు, అధికారులు చేరుకుని సహాయ చర్యలను చేపడుతున్నారు. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నట్లు అనుమానం వ్యక్తచేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. పెద్ద పెద్ద బండరాళ్లు ఇళ్లపై పడటంతో.. ఆయా ఇళ్లల్లో ఉన్న వారు చనిపోయారని పేర్కొంటున్నారు. Also read: Heavy rain alert: హైదరాబాద్‌కి భారీ వర్షసూచన.. 3 రోజుల పాటు భారీ వర్షాలు

ఇదిలాఉంటే.. ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ (Asaduddin Owaisi) సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. బండ్లగుడలోని మొహమ్మదీయా హిల్స్‌లో ఒక ప్రైవేట్ సరిహద్దు గోడ పడి 9 మంది మరణించారని.. ఇద్దరు గాయపడ్డారని ఆయన ట్విట్ చేశారు. ప్రస్తుతం ఆయన పలుప్రాంతాల్లో పర్యటిస్తూ.. పరిస్థితిని సమీక్షిస్తున్నానంటూ ట్విట్ చేశారు. అయితే మరో రెండు రోజులపాటు హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికను సైతం జారీ చేసింది. ఇప్పటికీ నగరంలో భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News