TAX TO TEMPLE: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. మున్సిపల్ ట్యాక్స్ విషయంలో గతంలో చాలాసార్లు జీహెచ్ఎంసీ అధికారులు విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా ఎల్బీనగర్ జోన్ లో జరిగిన ఘటన కలకలం రేపుతోంది. హిందూ సంఘాల ఆగ్రహానికి కారణమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే ఎల్బీనగర్ సర్కిల్ లోని బైరామల్ గూడలోని అంజనేయ స్వామి అలయానికి బల్దియా అధికారులు నోటీసులు పంపించారు, మున్సిపల్ ట్యాక్స్ చెల్లించాలని సర్కిల్ 4 అధికారులు ఈ నోటీసు ఇచ్చారు. ఇదే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆంజనేయ స్వామి ఆలయానికి ట్యాక్ కట్టాలని నోటీస్ ఇవ్వడంపై భక్తులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బైరామల్ గూడలో చాలా ఏళ్లుగా హనుమాన్ ఆలయం ఉంది. గతంలో ఎప్పుడు ఇలా నోటీసులు ఇవ్వలేదు. తాజా ఘటనపై ఆలయ కమిటి సభ్యులు ఆందోళనకు సిద్దమవుతున్నారు.


హనుమాన్ ఆలయానికి ట్యాక్స్ నోటీస్ ఇవ్వడంపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. దేవాలయానికి మున్సిపల్ టాక్స్ విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వీహెచ్ పీ నేతలు. ఎల్ బి నగర్ సర్కిల్ అధికారులు ఆంజనేయ స్వామి దేవాలయానికి మున్సిపల్ టాక్స్ కట్టమంటూ దేవుడికే నోటిసు పంపడం సిగ్గుచేటని వీహెచ్ పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ విమర్శించారు. ప్రభుత్వ హిందూ వ్యతిరేక ఎజెండా కు ఇది నిదర్శనమన్నారు. హిందువుల విశ్వాసాలు గాయపడేలా వ్యవహరించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శశిధర్ డిమాండ్ చేశారు. 


Read also: Ys Sharmila on Kcr: వైఎస్‌ఆర్‌ విగ్రహంపై చేయి వేశారా ఖబడ్దార్..టీఆర్ఎస్‌పై షర్మిల హాట్ కామెంట్స్..!


Read also: Revanth Reddy: వచ్చే ఎన్నికల్లో వాళ్లకే టికెట్లు... రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి