Ghmc dons birth control drive in Hyderabad: కొన్నిరోజులుగా కుక్కలు మనుషులపై దాడులు చేస్తున్న ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. ఒకప్పుడు గ్రామాల్లో వీధికుక్కలు ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం పట్టణాలలో కూడా అదే పరిస్థితి నెలకొంది. కుక్కలు మీద పడి మరీ కరిచేస్తున్నాయి. చిన్న.. పెద్దా తేడాలేకుండా.. మీద పడి కరిచేస్తున్నాయి. ఒకప్పుడు కుక్కలను గ్రామ సింహాలు అని భావించేవారు.ఇవి గ్రామలలో కొత్త వారు కన్పిస్తే.. అరుస్తు అందరిని అలర్ట్ చేసేవి. కానీ ఇప్పుడు పరిస్థితి దీనికి భిన్నంగా మారిపోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్తవాళ్లను కాదు... కదా.. ఎవరు కన్పిస్తే.. వారిని కుక్కలు కరిచేస్తున్నాయి. దీంతో జనాలు భయంతో అల్లాడిపోతున్నారు. స్కూల్స్ లకు వెళ్లేటప్పుడు, ఆఫీసులకు వెళ్లేటప్పుడు.. ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ల మీద కుక్కలు గుంపులుగా దాడులు చేస్తున్నాయి. అంతే కాకుండా..కొన్నిసార్లు దాడులు చేసి.. రక్తం, మాంసం ముద్దలను బైటుకు తీస్తున్నాయి. 


ఇటీవల హైదరాబాద్ లో కుక్కల దాడులు ఘటనలు నగరవాసుల్ని కంటి మీద కునుకులేకుండా చేసిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటీవల కుక్కల పంచాయతీపై ఏకంగా తెలంగాణ హైకోర్టు కూడా సుమోటోగా స్వీకరించి దీనిపై ఎలాంటి చర్యలుతీసుకున్నారో చెప్పాలని కూడా అధికారుల్ని ఆదేశించింది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు నగర్ వాసులకు బిగ్ రిలీఫ్ ను కల్గించే విషయం చెప్పారు. 


పూర్తి వివరాలు..


హైదరాబాద్ లో వాసులు గత కొన్నిరోజులుగా కుక్కల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి పూట కుక్కలు రెచ్చిపోతున్నాయి. కన్పించిన వారి మీద దాడులు చేస్తు.. భయ భ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఒకప్పుడు.. కుక్కలను రాయితో కొడితేనో.. వాటిని ఇబ్బందులు కల్గజేసేలా ప్రవర్తిస్తే.. అవి దాడులు చేసేవి. కానీ ఇప్పుడు సిట్యూవేషన్ పూర్తిగా భిన్నంగా మారిపోయింది.వాటిని ఏమన్నా.. అనకున్న కూడా దాడులు చేస్తున్నాయి. తమ దారిన తాము.. పోతున్న కూడా కుక్కలు దాడులుచేస్తున్నాయి.


ఈ క్రమంలో కుక్కల దాడులపై హైదరాబాద్ వాసులు.. జీహెచ్ఎంసీ బల్దియా వారికి పలు మార్లు ఫిర్యాదులు చేశారు. దీంతో జీహెచ్ఎంసీ కమిషనరల్ ఆమ్రాపాలీ కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరబాద్ నగర వ్యాప్తంగా ఎక్కడైన కుక్కలు ఇబ్బందులు పెడితే తమకు ఫిర్యాదులు చేయాలన్నారు. దీని కోసం మై జీహెచ్ఎంసీ యాప్ అని కొత్తగా ప్రారంభించారు.ఈ మేరకు సంక్షిప్త సందేశాల రూపంలో గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలోని 20 లక్షల ఫోన్‌ నంబర్లకు మెసేజ్ పంపించినట్లు తెలిపారు. యాప్‌లో ‘వెటర్నరీ గ్రీవెన్స్‌’ లింక్‌ను క్లిక్‌ చేసి ఆయా కుక్కల ఫొటోలు, ప్రాంతం వంటి వివరాలు అందించాలని కోరారు.


Read more: Snake video: వామ్మో.. ఇదేక్కడి మాస్ రా మావా... షర్ట్ లో దూరిన భారీ సర్పం.. వైరల్ గా మారిన వీడియో..


వీధి కుక్కలను కంట్రోల్ చేసేందుకు గాను.. వాటికి సంతానం కలగకుండా శస్త్రచికిత్సలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. వీటిని గుర్తించేందుకు వీలుగా వీధి కుక్కల చెవిని 'V' ఆకారంలో కత్తిరిస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి వెల్లడించారు. చెవి కత్తిరించని కుక్కలకు బర్త్ కంట్రోల్ సర్జరీ జరలేదని.. అలాంటి కుక్కలు ఎవరికైనా కనిపిస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని కూడా ఆమ్రాపాలీ ఒక ప్రకటనలో వెల్లడించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి