Vemulawada Temple Missed: తెలంగాణ ఇలవేల్పుగా అలరారుతున్న వేములవాడ ఆలయంలో మరో సంఘటన చోటుచేసుకుంది. ఆలయ ఆవరణలో బాలిక అదృశ్యమైంది. పది రోజులు గడిచినా కూడా బాలిక ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ పాపను ఎలాగైనా వెతికి పట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, ఆలయ అధికారుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KR Krishna: న్యూఇయర్‌ తొలిరోజే సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. షాక్‌లో హీరో నాని


రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నాలుగేళ్ల చిన్నారి అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారి కనిపించకుండాపోయి 10 రోజులు గడవడం గమనార్హం. దీంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గంగ స్వామి తన సోదరి సింగారపు లాస్యకు మతిస్థిమితం సక్రమంగా లేదు. ఆమె తన కుటుంబంతో కలిసి డిసెంబర్ 10వ తేదీన ఇంటి నుంచి కూతురుతో కనిపించకుండా పోయింది.

Also Read: Women Thieves Arrest: మహిళలను చూసి లిఫ్ట్‌ ఇస్తే నిలువు దోపిడీ.. హైదరాబాద్‌లో కి'లేడీ'లు అరెస్ట్‌


డిసెంబర్ 28వ తేదీన వేములవాడ రాజన్న గుడి మెట్ల వద్ద తన సోదరి లాస్య, కోడలు అధ్విత కనిపించారు. ఈ సమాచారం తెలుసుకున్న గంగ స్వామి ఆదివారం రాజన్న గుడి వద్దకు చేరుకొని గాలించారు. అయితే సీసీ ఫుటేజీ పరిశీలించగా తల్లి లాస్య కనిపించగా.. చిన్నారి అధ్విత కనిపించ లేదని పోలీసులకు పోలీసులకు మేనమామ గంగస్వామి ఫిర్యాదు చేశారు. పాపను తీసుకెళ్లిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే సీసీ ఫుటేజీ పరిశీలించగా వేములవాడ ఆలయంలో తల్లి లాస్య, పాప అధ్వైతకు పక్కన ఓ మహిళ ఉందని గుర్తించారు. ఆమెనే పాపను ఎత్తుకెళ్లి ఉంటుందని గంగస్వామి ఆరోపిస్తున్నాడు. పోలీసులు త్వరగా చర్యలు తీసుకోవాలని.. తన సోదరి లాస్యతోపాటు మేనకోడలు అధ్వైతను గాలించి పట్టుకోవాలని గంగస్వామి విజ్ఞప్తి చేస్తున్నాడు.


భారీగా ఆదాయం..
మరోవైపు వేములవాడ రాజన్నకు భారీగా ఆదాయం సమకూరింది. 26 రోజుల హుండీ ఆదాయాన్ని ఆలయ ఓపెన్ స్లాబ్‌లో  లెక్కించారు. 26 రోజులకు హుండీ ఆదాయo రూ.1,27,46,977 లభించగా.. బంగారం 395 గ్రాములు రాగా.. వెండి 8 కిలోల 100 గ్రాములు  వచ్చినట్లు ఈవో వినోద్ రెడ్డి తెలిపారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook