PM Modi On SC Categorisation: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో శనివారం జరిగిన మాదిగ విశ్వరూప మహాసభకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్బంగా మోదీ కీలక ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణకు త్వరలోనే కమిటీని వేస్తామని ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై మోదీ మాట్లాడుతున్న సమయంలో ఓ యువతి ఫ్లడ్‌లైట్‌ స్తంభం ఎక్కింది. గమనించి ప్రధాని వెంటనే.. యువతిని కిందకు దిగాలని రిక్వెస్ట్ చేశారు. తల్లీ కిందకు దిగాలి.. ఇది మంచిది కాదని అన్నారు. తాను మీతో ఉన్నానని.. తాను నీ మాట వింటానని చెప్పారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. మీకోసమే తాను ఇక్కడికి వచ్చానని అన్నారు. యువతిని కిందకు దిగాలని పలుమార్లు మోదీ రిక్వెస్ చేయగా.. యువతి స్తంభంపై నుంచి కిందకు దిగింది. దీంతో సభలో ఉన్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం మోదీ మోదీ తన ప్రసంగం కంటిన్యూ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు ప్రధాని మోదీ. గత పదేళ్లలో తెలంగాణలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాదిగ సమాజానికి ద్రోహం చేసిందని విమర్శించారు. ఎన్నికల ముందు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చి.. మోసం చేసిందని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఏర్పడక ముందు దళిత వర్గానికి చెందిన వ్యక్తిని సీఎం చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని.. ఆ తరువాత ఏం జరిగిందో అందరికీ తెలుసని ప్రధాని అన్నారు.


 




రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ ప్రజలకు సూచించారు. ఈ రెండు పార్టీలు ఒకే నాణానికి రెండు పార్శ్వాలు అని.. పైకి ఒక విషయం చెప్పి.. లోపల మరొకటి చేస్తాయని విమర్శించారు. సంక్షేమ పథకాల పేరుతో ఈ రెండు ప్రభుత్వాలు ఎన్నో మోసాలకు పాల్పడ్డాయని.. వీరిద్దరిలో ఎవరు గెలిచినా అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం మరింత వెనుకబడిపోతుందన్నారు. ఈ రెండూ అవినీతి పార్టీలేనని అన్నారు. 


రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేస్తోందని.. ప్రస్తుతం తెలంగాణ సంకట స్థితిలో ఉందన్నారు ప్రధాని మోదీ. తెలంగాణ అస్థిత్వాన్ని బీఆర్ఎస్ కాపాడలేకపోయిందని.. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని ఇవ్వకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితబంధు పథకం వల్ల బీఆర్ఎస్‌ నేతలకే మేలు జరిగిందన్నారు. రాష్ట్రంలో ఈసారి బీజేపీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారని అన్నారు.


Also Read: Unknown Facts About Chandra Mohan: చంద్రమోహన్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..ఆయనకు గుర్తింపు తెచ్చిన సినిమా ఇవే! 


Also Read:  Delhi Air Pollution: ఢిల్లీపై కరుణించిన ప్రకృతి, వర్షం కారణంగా పెరిగిన గాలి నాణ్యత


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook