KTR: ఎన్నికల్లో 12 ఎంపీలు ఇవ్వండి.. కేసీఆర్‌ను సీఎం చేద్దాం: కేటీఆర్ పిలుపు
KT Rama Rao Says KCR Will Again Chief Minister: లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపిస్తే మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. మోదీ, రాహుల్‌తో తెలంగాణకు ఒరిగేదేమీ లేదన్నారు.
KCR Again CM: అధికారం కోల్పోయిన వెంటనే తెలంగాణలో ఉమ్మడి ఏపీలో నెలకొన్న దుర్భర పరిస్థితులు తిరిగి వచ్చాయని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. పదేళ్లు సుభిక్షంగా ఉన్న తెలంగాణ దుర్భిక్షంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. 12 ఎంపీ సీట్లు ఇవ్వండి.. మళ్లీ ఆరు నెలల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుందని ప్రకటించారు. నరేంద్ర మోదీతో పోరాటం రాహుల్ గాంధీకి చేతకాదని కేసీఆర్ లాంటి వ్యక్తులకు సాధ్యమని తెలిపారు.
Also Read: KCR Meets Teacher: భావోద్వేగానికి లోనయిన మాజీ ముఖ్యమంత్రి.. గురువు కాళ్లు మొక్కిన కేసీఆర్
రిజర్వేషన్లు రద్దు చేయాలని మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేటీఆర్ కూడా తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, అగ్రవర్ణాల్లో పేదల రిజర్వేషన్ల రద్దుకు కుట్ర జరుగుతోందని చెప్పారు. రాజ్యాంగాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్న బీజేపీతో కొట్లాడే శక్తి కాంగ్రెస్‌కు లేదు అని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా పడగొట్టాలని చూశారని గుర్తుచేశారు. ఎమ్మెల్యేలను కొనేందుకు యత్నించినట్లు వివరించారు. కానీ కేసీఆర్ ముందు వారి ఆటలు సాగలేదని పేర్కొన్నారు.
Also Read: Narendra Modi: 'ఆర్‌ఆర్‌ఆర్'తో దేశం గర్విస్తే.. 'ఆర్' ట్యాక్స్‌తో సిగ్గుపడుతోంది: ప్రధాని మోదీ
మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ అల్వాల్‌లో గురువారం ఏర్పాటుచేసిన యువజన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రాల్లో ప్రాంతీయ శక్తులు బలంగా ఉండాలి. ఆరు నెలల్లో బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుందన్నారు. మోదీతో పోరాటం రాహుల్ గాంధీ వల్ల కాదని కొట్టిపారేశారు. ఈ క్రమంలో బీజేపీ, నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ ప్రభుత్వం హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని చూస్తోందని ఆరోపించారు. అలా చేస్తే కేంద్రంలోని సవతి తల్లిపై పోరాడాల్సి ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీకి గులామ్‌గిరీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'బీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలని అడుగుతున్నారు. 2021లో టీఆర్‌ఎస్ పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ సాధించుకోవాలంటే పార్లమెంట్‌లో మనం శాసించే పరిస్థితి ఉండాలని .. 17 ఎంపీలను గెలిపించాలని కోరారు. వైఎస్సార్, చంద్రబాబు కలిసి తెలంగాణ ఎలా తెస్తాడని అవహేళన చేశారు. కానీ అదే కేసీఆర్ రెండు ఎంపీ స్థానాలతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణ గురించి దమ్మున్న నాయకులే కొట్లాడుతారు' అని కేటీఆర్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter