TS Inter Exam Papers Valuation: ఇంటర్ ఎగ్జామ్స్ పేపర్ వ్యాల్యూయేషన్ టెండర్స్ రద్దు ?
TS Inter Exam Papers Valuation Tenders: గతంలో ఇంటర్ ఎగ్జామ్స్ పేపర్స్ మూల్యాంకనంలో గ్లోబరేనా సంస్థ చేసిన తప్పిదాలు వల్లే ఎంతో మంది విద్యార్థులకు మార్కులు తప్పులతడకగా పడినట్టు భారీ ఎత్తున ఆరోపణలు రావడం గుర్తుండే ఉంటుంది. ఇంటర్ పరీక్షల్లో తమకు వచ్చిన మార్కులు చూసి ధైర్యం కోల్పోయిన కొంతమంది విద్యార్థిని, విద్యార్థులు అప్పట్లో సూసైడ్స్ చేసుకోవడం పెను వివాదానికి దారితీసింది.
TS Inter Exam Papers Valuation Tenders: హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పేపర్ వ్యాల్యూయేషన్‌లో కీలక పాత్ర పోషించే సంస్థలను టెండర్స్ ద్వారా ఎంపిక చేస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో ఇంటర్ ఎగ్జామ్స్ పేపర్స్ మూల్యాంకనంలో గ్లోబరేనా సంస్థ చేసిన తప్పిదాలు వల్లే ఎంతో మంది విద్యార్థులకు మార్కులు తప్పులతడకగా పడినట్టు భారీ ఎత్తున ఆరోపణలు రావడం గుర్తుండే ఉంటుంది. ఇంటర్ పరీక్షల్లో తమకు వచ్చిన మార్కులు చూసి ధైర్యం కోల్పోయిన కొంతమంది విద్యార్థిని, విద్యార్థులు అప్పట్లో సూసైడ్స్ చేసుకోవడం పెను వివాదానికి దారితీసింది. ఇంటర్మీడియెట్ బోర్డుపై ఎన్నో ఆరోపణలకు దారితీసిన ఆ వివాదం ఇంటర్ బోర్డులో అవినీతి పేరుకుపోయిందనే మాయని మచ్చను వేయడానికి కారణమైంది. అంతేకాకుండా ఈ గ్లోబరేనా సంస్థ మంత్రి కేటీఆర్ బంధువులకు చెందినది.. అందుకనే నిబంధనలకు విరుద్ధంగా గ్లోబరేనా సాఫ్ట్‌వేర్ సంస్థను ఎంపిక చేశారని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి.
తాజాగా మరోసారి ఇంటర్ ఎగ్జామ్స్ సమీపిస్తున్న నేపథ్యంలో ఇంటర్ పరీక్షల పేపర్ల వ్యాల్యూయేషన్ కోసం పిలిచిన టెండర్లలో మరోసారి గ్లోబరేనా సాఫ్ట్‌వేర్ సంస్థ టెండర్స్ దాఖలు చేయడానికి గట్టి ప్రయత్నాలు చేసిందా అంటే అవుననే తెలుస్తోంది. అంతేకాకుండా ఈ విషయంలో ఇంటర్ బోర్డ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ రూ. 6 కోట్ల ముడుపులు తీసుకున్నారని కూడా ఇటీవల ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ డాక్టర్ పి మధుసూదన్ రెడ్డి చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గ్లోబరేనా సంస్థ మరో పేరుతో టెండర్ దాఖలు చేసిందంటూ.. ఆ సంస్థకు సహకరించినందుకుగాను నవీన్ మిట్టల్‌కి 6 కోట్లు అందాయంటూ ఆయన చేసిన ఆరోపణలు పెను సంచలనం సృష్టించాయి. తాజాగా ఇంటర్ విద్యా మండలి ఆన్లైన్ వాల్యూయేషన్ కోసం జారీ చేసిన టెండర్స్‌ను రద్దు చేయడంపై తాజాగా డాక్టర్ పి మధుసూదన్ రెడ్డి హర్షం వ్యక్తంచేస్తూ ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఇంటర్మీడియట్ విద్యా మండలిలో మరోసారి అక్రమంగా ప్రవేశించడానికి గ్లోబరేనా సాఫ్ట్‌వేర్ సంస్థ చేసిన ప్రయత్నాన్ని ఎండ కట్టడంలో ఇంటర్ విద్యా జేఏసీ విజయం సాధించిందని పి మధుసూదన్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఇంటర్ బోర్డు ఆహ్వానించిన టెండర్ల ప్రక్రియలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఎప్పటికప్పుడు పసిగడుతూ ఇంటర్ బోర్డు తీరును ఎండగట్టడం వల్లే ఆ కంపెనీలు వెనక్కి తగ్గి టెండర్ దాఖలుకు ముందుకు రాలేదని.. ఇది ప్రభుత్వ ఇంటర్ విద్యా జేఏసి విజయంగా ఆయన అభివర్ణించారు.
ఈ వివాదంపై ఇంటర్ విద్య జేఏసి చైర్మన్ స్పందిస్తూ.. " ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ టెండర్లకి సంబంధించి మౌలికమైన మార్పులు చేసి అనుభవం ఉన్న సంస్థలతో ఆన్లైన్ వాల్యుయేషన్‌ని దశలవారీగా అమలు చేయాలి" అని ఇంటర్ బోర్డును కోరారు. అంతేకాకుండా ఆన్లైన్ వాల్యుయేషన్ పట్ల అధ్యాపకులకు శిక్షణ ఇచ్చి, ప్రయోగాత్మక పద్ధతిని మే నెలలో జరగబోయే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పేపర్స్ వ్యాల్యుయేషన్ నుండే అమలు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని ఇంటర్ బోర్డుకు సూచించారు.
ఇది కూడా చదవండి : Etela Rajender: నేను బీఆర్ఎస్‌ను వీడలేదు.. వాళ్లే నన్ను బయటకు పంపారు.. పార్టీ మార్పుపై ఈటల హాట్ కామెంట్స్
ఇది కూడా చదవండి : TS Schools Summer Holidays 2023: స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటన.. ఎప్పటి నుంచి అంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook