Gold Smuggling at Shamshabad Airport: స్మగ్లర్లు తెలివిమీరిపోతున్నారు. టెక్నాలజీ పెరిగేకొద్దీ తమ జీవనవిధానాన్ని మెరుగు చేసుకోవడానికి బదులుగా అడ్డదారులు తొక్కుతుంటారు కొందరు. తెలివితేటలు ప్రదర్శిస్తూ స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తికి కస్టమ్స్ అధికారులు అంతే చాకచక్యంగా కనిపెట్టి అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఓ ప్రయాణికుడు ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి హర్యానాకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాని (Shamshabad Airport)కి చేరుకున్నాడు. అతడి కదలికలపై అధికారులకు అనుమానం వచ్చింది. తనిఖీ చేసిన కస్టమ్స్‌ అధికారులు.. క్యాష్ కౌంటింగ్ మెషీన్‌లో పెట్టి 375 గ్రాముల బంగారాన్ని తరలిస్తున్నాడని గుర్తించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.


Also Read: BSNL Cheapest Plan: తక్కువ ధరకు రీఛార్జ్ ప్లాన్.. Airtel, Jio మరియు VIలకు షాక్!



క్యాష్ కౌంటింగ్ మెషీన్‌లో బంగారాన్ని కడ్డీలు (Gold Smuggling)గా మార్చి అమర్చాడు. తెలివిగా స్మగ్లింగ్ చేయబోతుంటే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఎక్కువ శాతం దుబాయి, గల్ఫ్‌ దేశాల నుంచి బంగారం అక్రమంగా తరలించేందుకు యత్నిస్తుంటారని వివరించారు.


Also Read: Gold Price Today 20Th December 2020: పసిడి ధరకు రెక్కలు.. వెండి ధరలు పైపైకి!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook