Group-4 Application edit Option: గ్రూప్-4 దరఖాస్తులో తప్పులు సవరించుకునేందుకు టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. ఈ నెల 9 నుంచి 15వ తేదీ వ‌ర‌కు అభ్య‌ర్థులు త‌మ ద‌ర‌ఖాస్తుల్లో త‌ప్పుల‌ను స‌రి చేసుకోవ‌చ్చ‌ని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) వెల్లడించింది. మరోసారి ఎడిట్ ఆప్షన్ ఉండదని కూడా టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. గ్రూప్-4 ద్వారా వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, వార్డ్ ఆఫీసర్, జూనియర్ ఆడిటర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

8,180 గ్రూప్ -4 జాబ్స్ కోసం తెలంగాణ వ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. గ్రూప్-4 రాత ప‌రీక్ష‌ను జులై 1వ తేదీన టీఎస్పీఎస్సీ నిర్వహించనుంది. దరఖాస్తుల్లో వివరాలను తప్పుగా నమోదు చేసిన కొందరు అభ్యర్థులు.. వాటిని సరి చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని టీఎస్పీఎస్సీని కోరారు. కమిషన్ స్పందించి ఎడిట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. ప్రశ్నపత్రం ఆంగ్లం, తెలుగు లేదా ఆంగ్లం, ఉర్దూలో ఉంటుందని.. వాటిలో ఏదో ఒక దానిని ఎంచుకోవాలని కమిషన్ సూచించింది. 


పీఈసెట్ దరఖాస్తు గడువు పెంపు
నేటితో ముగియనున్న పీ ఈసెట్ దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. వ్యాయామ విద్య ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువు మే 16 వరకు పెంచుతూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబందించిన నోటిఫికేషన్ ను మార్చి 13న జారీ చేసిన సంగతి తెలిసిందే. 


Also Read: NEET 2023 Exam: ఇవాళే నీట్ ఎగ్జామ్​.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook