Ticket Price Reduced For Passenger Trains In Bodhan: మనలో చాలా మంది రైల్వే ప్రయాణంవైపు ఎక్కువగా మోగ్గుచూపుతుంటారు. సరదాగా ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ తో కలిసి రైలులో ప్రయాణిస్తుంటారు. రైలులో కూర్చుని సరదాగా జర్నీచేస్తుంటారు. దూరం ప్రాంతంలో వెళ్లేవారు కూడా రైలును ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు.  అదే విధంగా దగ్గర దగ్గర స్టాపులలో బస్సుల కన్నా.. కూడా రైలులో ఎక్కువగా జర్నీలు చేస్తుంటారు.  ఈక్రమంలో రైల్వే శాఖ ప్రయాణికులు తీపికబురు చెప్పింది. బోధన్ నుంచి నడిచే ప్యాసింజ్ రైళ్ల టికెట్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఈ రైళ్లలో కరోనా కంటే ముందున్న ఉన్న చార్జీలను తిరిగి అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Abc Juice Benefits: ఈ మిరాకిల్ జ్యూస్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. మీరు తప్పకుండా తీసుకోండి!


ప్రస్తుతం బోధన్ నుంచి మహబూబ్ నగర్ కు రూ. 60 వసూలు చేస్తున్నారు. కాచీగూడ 45, కామారెడ్డి రూ. 20,  నిజామాబాద్ రూ. 10, కరీంనగర్ కు రూ. 40, ఆర్మూర్ కు రూ. 20 చార్జీలుగా వసూలు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. దీంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇవి కరోనాకంటే ముందు చార్జీలని రైల్వే శాఖ తెలిపింది. ప్రస్తుతం ఆయా మార్గాలలో బస్సు చార్జీలు భారీ పెరిగిపోయి గుదిబండలాగా మారాయి.


ఈ క్రమంలోనే ప్యాసింజర్ రైలును తిరిగి ప్రారంభించడంతో పాటు, చార్జీలు తక్కువగా ఉండటంతో బోధన్ నుంచి స్టార్ట్ అయ్యే ప్యాసింజర్ రైలుకు ఫుల్ డిమాండ్ ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం దేశంలో అనేక మార్గాలలో కొత్త కొత్త రైలు నడుస్తున్నాయి.


Read More: Shraddha Das: అందాల కొండ కోనల్లో శ్రద్ధా దాస్ గ్లామరస్ బోటింగ్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..


సూపర్ ఫాస్ట్, వందే భారత్ రైళ్లు, ఎక్స్ ప్రెస్ ఇలా ప్రయాణికుల డిమాండ్ ను బట్టి రైల్వే శాఖ రైళ్ల సంఖ్యను పెంచుతుంది. రైల్వే శాఖకు ప్రయాణికుల వల్ల మంచి ఆదాయం సమకూరుతుంది. ఇక.. బోధన్, నిజామాబాద్ నుంచి పెద్ద ఎత్తున స్టూడెంట్స్ హైదరాబాద్ కు వస్తుంటారు. చదువుల కోసం, ఉద్యోగాల కోసం వచ్చే వారికి ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతాయని చెప్పవచ్చు. కొందరునిత్యం రాకపోకలు కూడా సాగిస్తుంటారు. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook