Abc Juice Benefits: ఈ మిరాకిల్ జ్యూస్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. మీరు తప్పకుండా తీసుకోండి!

Abc Juice Health Benefits: Abc జ్యూస్ అనేది ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా కలిగిన జ్యూస్. దీని తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. దీని మీరు కూడా మీ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు కలుగుతాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 3, 2024, 10:43 PM IST
Abc Juice Benefits: ఈ మిరాకిల్ జ్యూస్‌తో  ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. మీరు తప్పకుండా తీసుకోండి!

Abc Juice Health Benefits:  Abc జ్యూస్ అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్ తో కలిపి తయారు చేసే వంటకం. దీని ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరం ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటుంది. అంతేకాకుండా దీని వల్ల అనేక పోషకాలు, మినరల్స్‌ ఉంటాయి. ఈ జ్యూస్‌ను పిల్లలు, పెద్దలు తీసుకోవచ్చు. ప్రస్తుత కాలంలో సెలబ్రిటీలు  ఈ జ్యూస్ ని క్రమం తప్పకుండా తాగుతారు.  ఈ జ్యూస్ లో  విటమిన్స్,  మినిరల్స్ ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మీరు దీని ఉదయం తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. ముఖ్యంగా మహిళలు ఈ డ్రింక్‌ తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా, సన్నగా, అందంగా, కాంతివతంగా తయారు అవుతుంది. అయితే ఈ డ్రింక్‌ వల్ల కలిగే లాభాలు మీరు తప్పకుండా తెలుసుకోండి.

ఇందులోని పోషకాల వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు:

జీర్ణవ్యవస్థ: 

బీట్రూట్ , క్యారెట్లలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యను దూరంగా ఉంచుతుంది.

కళ్ళ ఆరోగ్యం: 

విటమిన్ ఎ అధికంగా ఉండే యాపిల్ కళ్ళ ఆరోగ్యానికి మంచిది. కంప్యూటర్ స్క్రీన్‌ను ఎక్కువగా చూడడం వల్ల కళ్ళు పొడిబారకుండా కాపాడుతుంది.

చర్మం-జుట్టు: ఈ జ్యూస్‌లోని యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలను రక్షించి, ముడతలు రాకుండా చేస్తాయి. జుట్టు ఆరోగ్యంగా, బలంగా ఉండేలా చేస్తాయి.

రక్తపోటు అదుపులో: ABC జ్యూస్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

పోషక విలువలు:

ABC జ్యూస్ లో  కావల్సిన పోషక విలువలు  ఉన్నాయి. దీని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు, కీళ్ల సమస్యలు, మహిళల సమస్యలు తగ్గుతాయి. జ్యూస్ లో ఉండే జింక్, పొటాషియం, కాల్షియం, ఐరన్,  యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. దీన్ని రోజు ప్రొద్దున బ్రేక్‌ ఫాస్ట్‌గా కూడా తీసుకోవచ్చును. ఈ జ్యూస్ లో రోజు మన శరీరానికి కావల్సిన క్యాలరీలు ఉంటాయి. 

గమనిక:  ఏదైనా కొత్త ఆహార పదార్థాన్ని తీసుకునే ముందు డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. ముఖ్యంగా మీకు ఇప్పటికే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే. కాబట్టి వైద్యుడిని సంప్రదించి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఉదయం పూట తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. పరగడుపున తీసుకోవడం చాలా మంచిది.

Also Read: LPG Cylinder Price Hike: ఫస్ట్‌రోజే సామాన్యులకు బిగ్ షాక్! ఎల్పీజీ గ్యాస్ ధరల పెంపు.. నగరాలవారీగా ధరలు ఎలా ఉన్నాయంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News