Telangana weather Updates: నైరుతి రుతుపవనాల రాక మెుదలైంది. ఇప్పటికే ఈ రుతుపవనాలు కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీలను తాకాయి. వచ్చే వారం తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులపాటు అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేడు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. 


ప్రతి సంవత్సరం జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయి. కానీ ఈసారి కాస్త లేటుగా కేరళలోకి ప్రవేశించాయి రుతుపవనాలు. ఎల్‌నివో ప్రభావం వల్ల ఆలస్యంగా జూన్ రెండో వారంలో కేరళ తీరాన్ని తాకాయి రుతుపవనాలు. జూన్ 15వ తేదీ నాటికి తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 


Also read: Kothakota Dayakar Reddy: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట కన్నుమూత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook