TSPSC Group-1 Prelims date fix: గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష డేట్ ను ఫిక్స్ చేసింది టీఎస్‌పీఎస్సీ. ఈ మేరకు కీలక ప్రకటన జారీ చేసింది. జూన్ 09న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించబోతున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) సోమవారం ప్రకటించింది. 2022లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ.. ఇటీవల 563 గ్రూప్‌ 1 ఉద్యోగాల భర్తీ కోసం టీఎస్‌పీఎస్సీ కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ షురూ అయింది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. సెప్టెంబర్‌/అక్టోబర్‌లో మెయిన్‌ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పరీక్షా విధానం:
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీ కలిపి 150 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 2.30 గంటలు. ఇందులో క్వాలిఫై అయిన వారు మెయిన్స్ కు అర్హత సాధిస్తారు. మెయిన్స్ ఎగ్జామ్ పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇందులో మొత్తం ఆరు పేపర్లు ఉంటాయి. వీటికి 900 మార్కులు కేటాయించారు. ఈ 6 పేపర్లకు అదనంగా జనరల్‌ ఇంగ్లీష్‌ అర్హత పేపర్‌గా పెట్టారు. ప్రతి పేపర్ కు 150 మార్కులు కేటాయించారు. వ్యవధి 3 గంటలుగా ఉంటుంది. 


Also Read: Telangana: రూ. 500 ధరకే గ్యాస్ సిలిండర్.. మొదట కంప్లీట్ అమౌంట్ ను చెల్లించాల్సిందే.. డిటెయిల్స్ మీకోసం..


PAPER-I: జనరల్ ఎస్సే 
PAPER-II: చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ 
PAPER –III – ఇండియన్‌ సొసైటీ, భారత రాజ్యాంగం, పరిపాలన వ్యవహారాలు
PAPER –IV – భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి 
PAPER- V – సైన్స్ అండ్ టెక్నాలజీ 
PAPER-VI - తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం 
జనరల్ ఇంగ్లీష్ (Qualifying పేపర్) - 150 మార్కులు.


Also Read: KTR Gifts: విద్యార్థులకు కేటీఆర్‌ 'అమూల్యమైన కానుక'.. చిన్నదే అయినా ఎంతో ప్రత్యేకం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook