Attack on vikarabad collector incident: వికారాబాద్ లోని లగ్గిచెర్ల గ్రామంలో ఫార్మా కోసం భూముల విషయంలో మాట్లాడేందుకు వచ్చిన కలెక్టర్ ప్రతీక్ జైన్ తో పాటు అధికారులపై గ్రామస్థులు ఒక్కసారిగా రాళ్లు, బండరాళ్లతో దాడులకు పాల్పడ్డారు.ఈ క్రమంలో ఒక్కసారిగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావణం నెలకొంది. అయితే.. కొంతమంది ప్లాన్ ప్రకారమే ఈ దాడులు చేసినట్లు కూడా తెలుస్తొంది. అంతే కాకుండా.. గ్రామం బైట సమావేశం నిర్వహించిన కలెక్టర్, ఇతర అధికారుల్ని గ్రామంలోకి రప్పించి మరీ దాడులు చేశారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా..ఈ ఘటన తర్వాత తెలంగాణ సర్కారు సీరియస్ గా స్పందించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతే కాకుండా..ఇప్పటి వరకు గ్రామంలో 300కు పైగా దాడులకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తొంది. అయితే.. ప్రస్తుతం వికారాబాద్ ఘటనకు మెయిన్ గా..సురేష్ అనే వ్యక్తి కారణమని పోలీసులు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తొంది. అంతే కాకుండా.. బీఆర్ఎస్ కుచెందిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో 42 సార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు తెలుస్తొంది. దీంతో పోలీసులు అతన్ని పట్టుకునే పనిలో ఉన్నరు. అయితే.. ప్రస్తుతం సురేష్ మాత్రం కన్పించకుండా పారిపోయినట్లు తెలుస్తొంది.


అతని కోసం ప్రత్యేకంగా పోలీసులు గాలింపు చేపట్టారు. మరోవైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని పోలీసులు హైదరబాద్ లోని.. కేబీఆర్ పార్కులో అరెస్ట్ చేసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో అరెస్ట్ తర్వాత నరేందర్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ ప్రజలకు ఫార్మా కోసం భూములు ఇవ్వడం ఇష్టంలేదని, సురేష్ ఒక యువనాయకుడని, అతనికి కూడా ఏడుఎకరాల వరకు భూమి ఉందని, ప్రజలు అందుకే తిరగబడ్డారని బీఆర్ఎస్ నరేందర్ రెడ్డి అన్నారు.


వికారాబాద్‌ జిల్లా.. లగచర్ల గ్రామంలో కలెక్టర్, రెవెన్యూ అధికారులపై జరిగిన దాడి ఘటన కలకలం రేపుతోంది. ఈ దాడికి సంబంధించి పోలీసులు ఇప్పటికే 16 మందిని అరెస్ట్‌ చేసి నిన్న అర్ధరాత్రి కొడంగల్‌ కోర్టులో హాజరు పరిచారు.వారికి మేజిస్ట్రేట్‌ 14 రోజుల రిమాండ్‌ విధించగా.. పరిగి సబ్‌జైలుకు తరలించారు. సోమవారం అర్ధరాత్రి లగచర్ల, రోటిబండతండా, పులిచర్లకుంట తండాల్లోకి వందల మంది పోలీసులు వచ్చి ముందుగా విద్యుత్‌ సరఫరా, ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేశారు. అనంతరం ఇళ్లలోకి దూసుకెళ్లి.. కొందరు పురుషులను అదుపులోకి తీసుకున్నారు.


అనుమానితులైన 50 మందిని పరిగి పోలీస్‌ స్టేషన్‌కు తరలించి సీసీ ఫుటేజీలు, వీడియోలు పరిశీలించి విచారించారు. అనంతరం దాడి ఘటనతో సంబంధం లేని 34 మందిని విడిచిపెట్టారు. మిగిలిన 16 మందిని పోలీసులు అరెస్టు చేసి, పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం అర్ధరాత్రి కొడంగల్‌ ఫస్ట్‌ క్లాస్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ శ్రీరామ్‌ ఎదుట హాజరు పరిచారు. మరోవైపు మంగళవారం ఉదయం నుంచి లగచర్ల, రోటిబండతండా, పులిచర్లకుంట తండాలు నిర్మానుష్యంగా మారాయి. జనసంచారం లేక రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి.


పోలీసులు మాత్రం.. సురేష్ ఏకంగా 42 సార్లు ఫోన్ లు చేయడం వెనుక కారణం ఏంటని, ఈయన్ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలుస్తొంది. ప్రస్తుతం అక్కడ ఎవ్వరికి కూడా ఫార్మా కోసం భూములు ఇవ్వడం ఇష్టంలేదని కూడా నరేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనతో మళ్లీ బీఆర్ఎస్ వర్సెస్  కాంగ్రెస్ ల మధ్య వార్ పీక్స్ కు చేరిందని చెప్పుకొవచ్చు.


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.