Governor Tamilisai Soundararajan two years journey: తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్‌ (Telangana Governor Tamilisai Soundararajan) బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తి అయ్యింది. ఈ విషయం తనకు చాలా సంతోషాన్ని ఇస్తుందని చెప్పారు ఆమె. గవర్నర్‌గా ఈ రెండేళ్లు తాను నిర్వహించిన విధులు, అనుభవాలపై రాసిన పుస్తకాన్ని రాజ్‌భవన్‌లో (Rajbhavan) ఆమె విడుదల చేశారు. తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. తన విధుల నిర్వహణలో రాజ్‌భవన్‌ సిబ్బంది సహకారం ఎంతో ఉందన్నారు. గవర్నర్‌గా తాను చేపట్టిన ప్రతి కార్యక్రమానికీ మీడియా ఎంతో సహకరించిందని గుర్తు చేసుకున్నారు. అందుకే తాను ప్రజలకు మరింత చేరువ కాగలిగానన్నారు. గవర్నర్‌గా తన రెండేళ్ల విజయాన్ని ఇటీవల మరణించిన తన తల్లికి అంకితమిస్తున్నట్లు తమిళిసై చెప్పారు.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేసీఆర్‌‌ను అలా ఒప్పించా


తనకు సీఎం కేసీఆర్‌తో (CM KCR) మంచి సంబంధాలు ఉన్నాయని తమిళిసై తెలిపారు. మొదట్లో ఆయుష్మాన్‌ భారత్‌కు కేసీఆర్‌‌ ఆసక్తి చూపలేదన్నారు. అయితే ఆయుష్మాన్‌ భారత్‌ (Ayushman Bharat)వల్ల వచ్చే ప్రయోజనాలన్నింటినీ కేసీఆర్‌‌కు తాను  వివరించనన్నారు తమిళసై. ఈ పథకం తెలంగాణ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పడంతో అప్పుడు సీఎం కేసీఆర్‌‌ తెలంగాణలో (Telangana) ఆ పథకాన్ని అమలు చేసేందుకు సమ్మతించారని గుర్తు చేసుకున్నారు. 


Also Read : Third wave: తెలంగాణ సర్కారుపై హై కోర్టు ఆగ్రహం.. థర్డ్ వేవ్ ఆగుతుందా అని మండిపాటు


ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు పెంచాలి


ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్‌ (Vaccination) వేగంగా జరుగుతోందని, ఇది ఎంతో అభినందనీయమని గవర్నర్‌ చెప్పారు. అయితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు మరింత పెంచాల్సిన అవసరముందని ఆమె అభిప్రాయపడ్డారు. అతి త్వరలో దేశంలోని ప్రతి ఒక్కరికీ టీకా అందుతుందని గవర్నర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. తలసేమియా రోగులకు సహాయం చేస్తున్న రెడ్‌క్రాస్‌, ఇండియన్‌ ఆర్మీకి గవర్నర్‌ తమిళిసై కృతజ్ఞతలు చెప్పారు.


కౌశిక్‌రెడ్డిపై కామెంట్స్


కాగా హుజురాబాద్‌కు చెందిన పాడి కౌశిక్‌రెడ్డికి (Koushik Reddy) ఎమ్మెల్సీ (MLC) పదవి ప్రతిపాదనపై గవర్నర్‌ తమిళిసై (Tamilisai) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సామాజిక సేవా విభాగంలో పంపినందున పరిశీలిస్తున్నానని వివరించారు.  సామాజిక సేవ చేసే వాళ్లకే ఆ ఎమ్మెల్సీ పదవి ఇస్తే బాగుంటుందని  సూచించారు. కౌశిక్‌రెడ్డి విషయంలో ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు.


Also Read : Side effects of COVID vaccine in women: మహిళలకే కొవిడ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువా ? ఎందుకు ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook