తెలంగాణ ఇంటర్ పరీక్షల్లో ఇక గ్రేడింగ్ ప్రక్రియ
తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు, పరీక్షా విధానాల్లో మార్పులకు శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా నేడు తమకు వచ్చే తక్కువ మార్కులను.. ఇతరులకు వచ్చే ఎక్కువ మార్కులతో పోల్చుకుంటూ.. ఆ తారతమ్యాల వల్ల విద్యార్థులు ఆత్మనూన్యతాభావాన్ని పెంచుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు, పరీక్షా విధానాల్లో మార్పులకు శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా నేడు తమకు వచ్చే తక్కువ మార్కులను.. ఇతరులకు వచ్చే ఎక్కువ మార్కులతో పోల్చుకుంటూ.. ఆ తారతమ్యాల వల్ల విద్యార్థులు ఆత్మనూన్యతాభావాన్ని పెంచుకుంటున్నారు. అలాంటి భావాలే వారిలో ప్రతికూల ఆలోచనలను పెంచుతూ.. ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి. ఈ సమస్యలను అరికట్టేందుకు ఇప్పుడు మార్కుల పద్ధతి కాకుండా.. గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) విధానం అమలు చేయాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
ఈ విధానం వల్ల విద్యార్థులకు తమ మార్కులను తెలుసుకునేందుకు అవకాశం ఉండదు. గ్రేడింగ్ వల్ల ప్రతి గ్రేడ్‌కు మధ్య 10 మార్కుల వ్యత్యాసం ఉంటుంది. ఉదాహరణకు 91-100 మధ్య మార్కులు వచ్చే విద్యార్థుల గ్రేడ్ పాయింట్ యావరేజ్‌ను ఏ 1గా పరిగణిస్తారు. దీనికి 10 గ్రేడ్ పాయింట్లు ఇస్తారు. 81-90 మధ్య మార్కులు వచ్చినవారిని ఏ 2 గ్రేడ్‌గా నిర్ణయిస్తారు. వారికి 9 గ్రేడ్ పాయింట్లు ఇస్తారు. 2018 మార్చిలో నిర్వహించే ఇంటర్ పరీక్షల నుండి ఈ విధానం అమలులోకి వచ్చే అవకాశం ఉంది.