Group -1 Exam: తెలంగాణలో ఈరోజు  నిర్వహించబోతున్న గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షపై హై టెన్షన్‌ నెలకొంది. ఒక వైపు అభ్యర్థుల ఆందోళనలు మరోవైపు పరీక్షల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు. ఇంకోవైపు సుప్రీంకోర్టులో విచారణ జరుగనున్న నేపథ్యంలో గ్రూప్‌- 1 పరీక్షపై ఉత్కంఠ నెలకొంది. గ్రూప్‌ -1 పరీక్షను వాయిదా వేయాలని.. జీవో నెం.29ని రద్దు చేసి ఎగ్జామ్ రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజుల గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. మరో వైపు చెప్పిన డేట్ ప్రకారం ప్రభుత్వం పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. ఇక మరికొన్ని గంటల్లో గ్రూప్‌-1 మెయిన్స్‌  పరీక్ష జరుగబోతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో దాదాపు 13 యేళ్ల లాంగ్ గ్యాప్  తర్వాత గ్రూప్‌-1 మెయిన్స్‌ ఎగ్జామ్ జరుగుతుండటంతో  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పకడ్బంది ఏర్పాట్లు చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఎలాంటి అపోహలు తలెత్తకుండా ముందస్తు  జాగ్రత్తలు తీసుకుంది. ఉద్దేశ పూర్వ కంగా తప్పుడు సమాచారం చేసే పోస్టులపై సైబర్ సెల్ అధికారుల గట్టి నిఘా పెట్టారు.


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..


గ్రూప్‌-1 మెయిన్స్‌  జరుగుతున్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 వేల 383 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 47 పరీక్షా కేంద్రాలు  ఏర్పాటు చేశారు.ఇవాళ మధ్యాహ్నం 2గంటల 30నిమిషాలకు ప్రారంభం కాబోతున్న గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు ఈ నెల 27వ తేది వరకు జరగనున్నాయి. అభ్యర్థులు మధ్యాహ్నం ఒంటి గంట 30నిమిషాలకు  ఎగ్జామ్ సెంటర్‌కు  చేరుకోవాలని సూచించారు. ఆ తర్వాత వచ్చే అభ్యర్థులకు పరీక్ష కేంద్రంలోకి అనుమతించమని తెలిపారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా అదనంగా ఒక గంట సమయాన్ని కేటాయిస్తున్నారు


పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను విధించారు.


ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..


ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter