హైదరాబాద్: తెలంగాణలో గతేడాది అక్టోబర్‌లో గ్రూప్‌-4కు సంబంధించిన జోనల్‌, జిల్లా, రాష్ట్ర కేడర్‌ పోస్టుల భర్తీ కోసం టీఎస్‌పిఎస్సీ నిర్వహించిన రాత పరీక్షను రద్దు చేయాల్సిందిగా కోరుతూ పలువురు అభ్యర్థులు తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై శనివారం విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ శావ్లి.. నాలుగు నోటిఫికేషన్లకు ఒకే పరీక్ష(కామన్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టు) ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఈ పిటిషన్‌పై తర్వాతి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.


హైకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్ 4 రిక్రూట్‌మెంట్ కోసం ఒకే పరీక్షను ఎందుకు నిర్వహించామనే అంశంపై తెలంగాణ సర్కార్ సోమవారం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనుంది.