Telangana dsc and groups aspirants protest: తెలంగాణలో గత కొన్నిరోజులుగా నిరుద్యోగులు రోడ్డెక్కారు. ముఖ్యంగా డీఎస్సీ, గ్రూప్స్ కు చెందిన విద్యార్థులు వెంటనే తమ ఎగ్జామ్ లను వాయిదావేయాలని , పోస్టులు పెంచి మరల నోటిఫికేషన్ లు ఇవ్వాలని కూడా రోడ్లు ఎక్కారు. నిన్న రాత్రి (జులై 13) రాత్రి అశోక్ నగర్, దిల్ సుఖ్ నగర్ లో నిరుద్యోగులు రాత్రివేళ రోడ్డుమీదకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వెంటనే ప్రభుత్వం డీఎస్సీ, గ్రూప్స్ ఎగ్జామ్ లను వాయిదా వేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అర్ధరాత్రి వరకు కూడా విద్యార్థులు నినాదాలు చేస్తు తమ గోడును ప్రభుత్వం వరకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో గ్రూప్స్ ఫ్యాకల్టీ అశోక్ సర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇంత పనికి మాలిన ప్రభుత్వం అనుకోలేదన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 నిరుద్యోగులు సామాజిక అవగాహాన కల్గిఉండాలని అన్నారు. ఎవరు ఏటుపోతే నాకేంటనీ ఓటు వేస్తే  ఇలాంటి వారు నాయకులు, సీఎంలు అవుతారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినందుకు బాధగా ఉందన్నారు. సీఎం రేవంత్ కు పాలన పట్ల అస్సలు అవగాహన లేదన్నారు. కేవలం మైక్ లు ముందు పెట్టుకుని, నీచపు భాష మాట్లాడుతాడని మండిపడ్డారు. ఇంత తెలివి తక్కువ వ్యక్తి సీఎం అవుతాడని అనుకోలేదన్నారు.


వెంటనే సీఎం నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కారించాలన్నారు. లేకపోతే.. ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసల మాదిరిగా.. హైదరాబాద్ లో..30 లక్షల  విద్యార్థులతో నిరసనలు తెలియజేస్తామన్నారు. హైదరబాద్ ను కదలనివ్వమంటూ రేవంత్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు విద్యార్థులు నిరసనలకు విద్యార్థి  సంఘనాయకులు, బీఆర్ఎస్ నేతలు,బీజేవైఎంలు ఇప్పటికే తమ మద్దతు ప్రకటించాయి. హరీష్ రావు, కేటీఆర్ లు ఇప్పటికే సీఎం సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు.


సీఎం రేవంత్ మాట్లాడుతూ..కొందరు కావాలని విద్యార్థుల్ని రెచ్చగొట్టి నిరసనలు చేస్తున్నారని అన్నారు. వయస్సు మీరిపోతే బెండకాయల మాదిరిగా ముదిరి పోతారని రేవంత్ ఇష్టమున్నట్లు మాట్లాడారు. దీంతో విద్యార్థి లోకం ఒక్కసారిగా భగ్గుమంది. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా.. అశోక్ నగర్, దిల్ సుఖ్ నగర్ లలో వందలాదిగా స్టూడెంట్ లు రోడ్డుమీదకు వచ్చి రాస్తారోకో నిర్వహించారు. ఈ ఘటన ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఉస్మానియాలో కూడా విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు.


Read more: Snake bite: పాముపగ నిజమా..?.. 40 రోజుల్లో 7 సార్లు కాటు.. 9 వ సారి చస్తానంటూన్న వికాస్ దూబే.. మిస్టరీగా మారిన ఘటన..


ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ పూటకో మాట మాట్లాడుతున్నారు. రోడ్డుమీదకు వెళ్లి ధర్నాలుచేయడం కన్నా.. మంత్రులతో కలిసి తమ గోడుచెప్పుకొవాలని అన్నారు. మరోవైపు సీతక్క.. ఎగ్జామ్ లపై మాట్లాడుతూ.. వాయిదా వేసే ప్రసక్తిలేదని, వాయిదా వేస్తే.. లేని కోర్టు చిక్కులు వస్తాయని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో నిరుద్యోగుల గోస మాత్రం ఆగమ్య గోచరంగా ఉందని చెప్పుకొవచ్చు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి