Gurukula students protest against pet in rajanna sircilla: కంటికి రెప్పల కాపాడాల్సిన విద్యార్థినుల పట్ల టీచర్ నీచంగా ప్రవర్తించింది. రుతుస్రావంలో ఉన్న విద్యార్థినులను  బట్టలు విప్పించి, పీఈటీ టీచర్ ఘోరంగా ప్రవర్తించింది. ఈ ఘటన ప్రస్తుతం తెలంగాణలో రచ్చగా మారింది.  గురుకులలో కొన్నిరోజులుగా పీఈటీ టీచర్ జ్యోత్స్న విద్యార్థినుల పట్ల చాలా కఠినంగా ప్రవర్తిస్తున్న ఘటన వెలుగులోకి  వచ్చింది. తాజాగా, ట్రైబర్ స్కూల్ విద్యార్థినులంతా రోడ్డెక్కి తమ నిరసనలు వ్యక్తం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. వెంటనే పీఈటీపై చర్యలు తీసుకొవాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు చెందిన నిరసనల వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.


పూర్తి వివరాలు..


రాజన్న సిరిసిల్ల లోని తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. సారంప‌ల్లి గిరిజ‌న బాలిక‌ల గురుకుల పాఠ‌శాల‌లో పీఈటీగా జ్యోత్స్న విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. ఆమె తరచుగా..  విద్యార్థినుల ప‌ట్ల రాక్ష‌సంగా ప్ర‌వ‌ర్తించారు. స్కూల్ ప్రేయర్ కు విద్యార్థినులు ఆలస్యంగా వస్తే.. వారిని నీచంగా దూషించింది.  కొంత మంది పీరియడ్స్ సమస్యల వల్ల ఆలస్యంగా వచ్చామని చెప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె.. విన్పించుకోకుండా.. విద్యార్థినులు దుస్తులు విప్పించి, ఘోరంగా ప్రవర్తించినట్లు కూడా ఘటన బైటపడింది. అంతేకాకుండా.. బాత్రూమ్‌లోనే బాధిత విద్యార్థినుల బ‌ట్ట‌లు విప్పించి, క‌ర్ర‌తో చిత‌క‌బాది వీడియోలు తీసిన‌ట్లు విద్యార్థినులు చెబుతున్నారు.



పీఈటీ జ్యోత్స్న నిత్యం త‌మ‌ను వేధిస్తోందంటూ విద్యార్థినులు రోడ్డెక్కి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆమెను సస్పెండ్ చేసిన తమకు.. న్యాయం చేయాలని కూడా విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. పీఈటీ జ్యోత్స్న అరాచ‌కాల‌పై ప్రిన్సిపాల్‌కు ఇత‌ర అధికారుల‌కు ఫిర్యాదు చేసిన‌ప్ప‌టికీ, ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విద్యార్థినులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.


మరోవైపు ..500 పైగా విద్యార్థినులకు రెండు బాత్రూంలే ఉన్నాయని కూడా స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో..  సిరిసిల్ల - సిద్దిపేట ప్రధాన రహదారి పై ధర్నాకు దిగినట్లు తెలుస్తోంది. పీఈటీ టీచర్.. బాత్రూంలో స్నానం చేస్తున్న సమయంలో లోనికి వచ్చి బట్టలు లేకుండా వీడియోలు తీస్తు బూతులు తిడుతూ కొడుతూ తీసుకెళ్తుందని విద్యార్థినులు రోడ్డెక్కి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Read more: Viral Video: పట్టాల మీదకు వచ్చి గుర్రుగా నిద్రపోయిన యువతి.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు.. వీడియో..


కాలేజీలో పార్ట్ టైం జాబ్ చేస్తున్న పిటీ జోత్స్న పెట్టి ఇబ్బందులు భరించలేక  ఇందిరమ్మ కాలనీలోని ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థినులు ఉదయం 5 గంటలకు సిరిసిల్ల - సిద్దిపేట ప్రధాన రహదారి పై రోడ్డెక్కినట్లు తెలుస్తోంది. వెంటనే.. పీఈటీ జ్యోత్స్న సస్పెండ్ చేయూలని ఆందోళల చేపట్టారు. విద్యార్థినులు కొట్టిన దెబ్బల్ని సైతం చూపిస్తు, సైకో టీచర్ ను సస్పెండ్ చేయాలని రోడ్డెక్కి నినాదాలు చేస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.