Congress Party Minister Komatireddy venkat Reddy Fires On Former cm kcr and KTR: కాంగ్రెస్ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈనేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ ఉంటాడో లేదో.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా బస్సుయాత్ర చేయడానికి అన్నిరకాల ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రజల్లోకి వెళ్లి మరల అధికారం సాధించేదిశగా ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మాజీ సీఎం కేసీఆర్ బస్సుయాత్రపై, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ బస్సుపై కాదు కాదా... మోకాళ్లపై తెలంగాణ అంతట యాత్రలు చేసిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కేసీఆర్ ఉంటడో పోతాడో తెల్వదు.... తాను మాట్లాడుతున్నది.. తండ్రి కొడుకులు ఇద్దరు జైలుకు వెళ్లడం గురించి అని చమత్కరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Smita Sabharwal: వరల్డ్ బుక్ డే... వైరల్ గా మారిన స్మితా సబర్వాల్ చేసిన లేటెస్ట్ ట్వీట్..


నల్లొండ , భువనగిరిలో కేసీఆర్, కేటీఆర్ ఎంత ప్రచారం చేసిన కూడా డిపాజిట్ కూడా రాదన్నారు. ఇప్పటికైన, కేసీఆర్ తన ప్రవర్తన మార్చుకొవాలని హితవు పలికారు. అదే విధంగా బీజేపీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్ రెడ్డిపై కూడా మంత్రి కోమటి రెడ్డి మండిపడ్డారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి ఒక పనికి మాలిన వాడంటూ వ్యాఖ్యలు చేశారు.  సీఎం రేవంత్ ఇప్పటికే తెలంగాణలో పదేళ్లపాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని చెప్పిన విషయం గుర్తు చేశారు. అయిన కూడా ఇతను నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడంటూ మంత్రి కోమటిరెడ్డి తీవ్రంగా స్పందించారు.


 


మరోవైపు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై  కేసీఆర్ ఇష్టమోచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని కాంగ్రెస్ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మండి పడ్డారు. తమ ప్రభుత్వం కూలిపోతుందంటూ మరోమారు కామెంట్లు చేస్తే.. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను పునాదులతో సహాలేపేస్తామంటూ కేసీఆర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా,  మాజీ  సీఎం కేసీఆర్ సంగారెడ్డిలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ పై విరుచుకుపడ్డారు.రుణ మాఫీపై సీఎం రేవంత్  ఒక మాట, మంత్రులు మరో మాట మాట్లాడుతున్నారని కేసీఆర్ అన్నారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రుణ మాఫీ మొత్తం ఒకేసారి ఇస్తామంటారు.. ఇక మంత్రి కోమటి రెడ్డి రుణమాఫీలను దశలవారీగా  ఇస్తామంటారు... వాళ్లలో వాళ్లకే ఒక క్లారిటీ లేదని కేసీఆర్ ఎద్దేవా చేశారు.


Read More: MLA Raja Singh: గాల్లో బాణం వేస్తే కేసులు పెడతారా.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్..


లోక్ సభ ఎన్నికలలో... కాంగ్రెస్‌కు 2 సీట్ల కంటే ఎక్కువ రావు అని సర్వే రిపోర్ట్లు వచ్చాయి.. అన్ని జిల్లాల్లో రైతులు తిరగబడుతున్నారు, రేవంత్ రెడ్డి భయం చూస్తే ఈ ప్రభుత్వం యేడాది కూడా ఉండేటట్లు కన్పించడంలేదంటూ మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ లో కరెంట్ కోతలు ఎక్కువయ్యాయని, 9 ఏండ్లల్లో కనురెప్ప కొట్టేంత సేపైనా కరెంటు పోయిందా?.. అని గుర్తు చేశారు. కరెంటు పోకుండా ఉండాలంటే పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలని కేసీఆర్ అన్నారు. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter