Hareesh Rao : హరీష్ రావు తెలంగాణ రాజకీయాల్లో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన నేత. తెలంగాణ ఉద్యమం మొదలు నేటి వరకు రాజకీయాల్లో హరీష్‌ రావుది కీలక పాత్ర. హరీష్ రావు అంటే సామాన్యులకే కాదు ఇతర రాజకీయ పార్టీ నేతలకు కూడా ఒక మంచి అభిప్రాయం ఉంది. పార్టీలకు అతీతంగా హరీష్ రావును అందరూ గౌరవిస్తారు. మంచి వాగ్ధాటి, ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారని హరీష్‌ రావుకు గుర్తింపు ఉంది. కేసీఆర్ అందుబాటులో లేని సమయంలో బీఆర్ఎస్ నేతలకు, కార్యకర్తలకు హరీష్‌ అండగా ఉంటూ వారి విజ్నప్తులను కేసీఆర్ కు హరీష్‌ చేరవేస్తారని సమాచారం. హరీష్‌ రావుతో చెప్పుకుంటే కేసీఆర్ తో చెప్పుకున్నట్లే అని బీఆర్ఎస్ లో మెజార్టీ నేతలు అనుకుంటుంటారు. అందుకే ప్రతి నిత్యం హరీష్‌ రావు నివాసంలో వేకువ జాము నుంచే నేతలు కార్యకర్తల హడావుడి  కొనసాగుతుంది. వచ్చింది ఎంత మందైనా అందరినీ కలిసి వారి వినతులను హరీష్ రావు స్వీకరిస్తాడని చెబుతుంటారు. ఇదే హరీష్‌ రావుకు చెప్పలేనంత అభిమానాన్ని తెచ్చిపెట్టందని ఆయన అనచరులు చెబుతుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ ఉద్యమ సమయం నుంచి అభివృద్ధిలో కూడా హరీష్‌ రావు చాలా ప్రముఖ పాత్ర పోషించారు. హరీష్ రావుకు ఏ బాధ్యత అప్పగించినా తిరుగుండదు అని పొలిటికల్ సర్కిల్ లో టాక్. ప్రతిపక్షంలో ఉన్నా, మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, పార్టీ పదవుల్లో ఉన్నా ఎప్పుడూ కష్టపడుతుంటారని పేరు. ఇలాంటి హరీష్‌ రావు పై బీజేపీ, కాంగ్రెస్ లో కూడా  కొందరికి చెప్పలేనంత అభిమానం ఉంది. పార్టీలకు అతీతంగా  హరీష్ రావును అభిమానిస్తుంటారు. ఇటీవల హరీష్ రావును కేంద్ర మంత్రి పొగడ్తలతో ముంచెత్తడం సంచలనంగా మారింది. ఆ కేంద్రం మంత్రి ఈ మధ్య కాలంలో పలు సందర్భాల్లో హరీష్‌ రావును ప్రశంసించడంలో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.


ఇంతకీ ఆ కేంద్ర మంత్రి ఎవరు..? ఆయన హరీష్‌ రావుపై చేసిన పొగడ్తలు ఏంటంటారా ..? విషయానికి వస్తే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్  మాజీ మంత్రి హరీష్ రావును తెగ పొగుడుతున్నారు. బీఆర్ఎస్ లో ఎవరైనా క్రెడిబిలిటీ ఉన్న నేత ఎవరైనా ఉన్నారంటే అది హరీష్‌ రావు ఒక్కరే అని ఈ మధ్య జరిగిన చిట్ చాట్ లో బండి సంజయ్ అన్నారు. అంతే కాదు గతంలో కూడా ఒక సారి బండి సంజయ్ ఇదే తరహా కామెంట్స్ చేశారు.బీఆర్ఎస్ లో హరీష్‌ రావు ఒక్కరే మంచి నేత అన్నారు. అంతే కాదు ఉద్యమకారుడిగా , కష్టపడి పనిచేసే నేతగా హరీష్ రావుకు మంచి గుర్తింపు ఉందని బండి సంజయ్ అన్నారు. ఇలా బండి సంజయ్ పదే పదే ఎందుకు అంటున్నారని పొలిటికల్ సర్కిల్ లో తెగ చర్చ జరుగుతుంది. దీని వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉందా లేకా నిజంగానే హరీష్ రావు పట్ల అభిమానం ఉందా అని ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీలో చర్చ జరుగుతుంది.


ఐతే బండి సంజయ్ కామెంట్స్ పై బీఆర్ఎస్ లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. బండి సంజయ్ చెప్పింది వందకు వంద శాతం నిజమంటూనే బండి సంజయ్ పై బీఆర్ఎస్ నేతలు మండి పడుతున్నారు.హరీష్‌ రావు గురించి తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు అని కొత్తగా బండి సంజయ్ చెప్పాల్సింది ఏందని వారి ప్రశ్న. బండి సంజయ్ హరీష్‌ రావును పొగడడంలో రాజకీయ కోణం ఉందని బీఆర్ఎస్ ను , హరీష్ రావును ఇరుకున పెట్టే విధంగా బండి సంజయ్ తీరు ఉందనేది బీఆర్ఎస్ నుంచి వస్తున్న కౌంటర్. బీఆర్ఎస్ శ్రేణులను గందరగోళానికి గురి చేసేందుకే బండి సంజయ్ ఇలా ప్రవర్తిస్తున్నారనేది వారి వాదన.


ఒక తెలంగాణ పొలిటికల్ సర్కిల్  లో మాత్రం బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై రక రకాల చర్చ జరుగుతుంది. తెలంగాణలో కేసీఆర్ తరువాత ఆ స్థాయిలో జనాల్లో ఆదరణ కలిగిన వ్యక్తిగా హరీష్ రావుకు పేరుంది. అలాంటి హరీష్‌ రావును తమ వైపు తిప్పుకునేందుకు ఇటు బీజేపీ, కాంగ్రెస్ లు ప్రయత్నించడం సహజమనేది కొందరి రాజకీయ విశ్లేషకుల మాట. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయంగా బీఆర్ఎస్ ఇబ్బంది పడుతున్న తరుణంలో హరీష్ రావును తమ పార్టీ వైపు లాగితే బాగుంటుంది కదా అని బీజేపీ భావించ ఉండవచ్చని అందులో భాగంగా బండి సంజయ్ తో ఇలా ఢిల్లీ పెద్దలు మాట్లాడిస్తుండొచ్చనే సందేహాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. హరీష్‌ రావు బీజేపీకీ వెళ్లినా, కాంగ్రెస్ కు వెళ్లినా ఆ పార్టీలకు కొండంత బలం పెరిగినట్లు అవుతుందనేది వారి అంచనా.


ఇదే విషయంపై హరీష్ రావు సన్నిహిత వర్గాలను అడిగితే వారు చెబుతున్నది ఒక్కటే. తెలంగాణలో తమ నాయకుడికి ప్రత్యేక గుర్తింపు ఉంది. గత రెండున్నర దశాబ్దాలుగా తెలంగాణ రాజకీయాల్లో తమ  నేత ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారని నిరంతరం కష్టపడే తత్వం తమ నాయకుడిది వారంటారు. ఆయన మాటే మా మాటా ఆయన బాటే మా బాట అనేది వారి మాట. ఇతర పార్టీల నేతలు సైతం తమ నాయకుడిని  పొగుడుతున్నారంటే అది మా నేత గొప్పతనం అని తెగ సంబరపడిపోతున్నారు. ఇదే సమయంలో పార్టీ మార్పుపై కూడా వారు ఒకటే చెబుతున్నారు. కేసీఆర్ బాటలోనే మా నేత నడుస్తున్నారని. ఆయనను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు కూడా అప్పడుప్పుడు కొందరు పార్టీ మార్పుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు.


ఇది ఇలా ఉంటే మాటి మాటికి బండి సంజయ్ హరీష్‌ రావును ఆకాశానికెత్తుతుండడంపై మాత్రం అనేక సందేహాలకు తావిస్తుంది. హరీష్ రావు రాజకీయంగా ఏదైనా నిర్ణయం తీసుకోబోతున్నారా లేదా ..? బీఆర్ఎస్ లో యాక్టివ్ గా ఉన్న హరీష్‌ రావును మానసికంగా దెబ్బతీసేందుకు బీజేపీ ఇలా ప్లాన్ చేస్తుందా అనేది చర్చ కూడా లేకపోలేదు. బండి సంజయ్ పొగడ్తల వెనుక ఉన్న రహస్యం ఏందనేది తెలియాలంటే మాత్రం మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే..!


Read more: Snakes: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే.. పాములకు రెడ్ కార్పేట్ వేసినట్లే.. పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయ్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.