Telangana Bhavan: మూసీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తాము వ్యతిరేకమని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. మూసీ నదిని బాగు చేయాలి కానీ పేదల ఇళ్లు కూల్చి బాగు చేస్తామంటే తాము అడ్డుకుంటామని తెలిపారు. భూ సేకరణ చట్టం సక్రమంగా అమలు చేయడం లేదని.. కేసీఆర్‌ హయాంలో పక్కాగా అమలు చేసి డబుల్‌ బెడ్రూం ఇళ్లు, ఉద్యోగం ఇచ్చినట్లు గుర్తుచేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇది చదవండి: Kalyana Lakshmi: 'తులం బంగారం ఏది?' అంటూ మహిళ నిలదీత.. ఖంగుతిన్న ఎమ్మెల్యే


మూసీ నది అభివృద్ధిపై రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న విధ్వంసంపై మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. 'మూసీ నది అభివృద్ధిపై కేంద్ర మంత్రి పార్లమెంటులో 2013 భూసేకరణ చట్టం పాటిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం శుద్ధ తప్పు. పార్లమెంటును,కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్‌ రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నాడు' అని ఆరోపించారు.

ఇది చదవండి: Telangana BJP: ఢిల్లీకి తెలంగాణ బీజేపీ బృందం.. ప్రధానితో భేటీ తర్వాత కీలక పరిణామాలు?


'2013లో యూపీఏ ప్రభుత్వం భూసేకరణ చట్టం తెచ్చి రాష్ట్రాలు సొంతంగా భూసేకరణ చట్టాలు తయారు చేసుకోవచ్చని కేంద్రం చెప్పింది' అని హరీశ్ రావు వివరించారు. అందులో భాగంగా కేసీఆర్ 2014లో తెలంగాణ రాష్ట్రంలో కొత్త భూసేకరణ చట్టం తెచ్చారని గుర్తు చేశారు. 'రాష్ట్ర ప్రభుత్వం చట్టంలో 250 గజాల ఇల్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని చట్టం చేసినట్లు తెలిపారు. మూసీ నది అభివృద్ధిపై డీపీఆర్, నోటిఫికేషన్ లేదని చెప్పారు.


బీఆర్ఎస్ పార్టీ హయాంలో అనేక ప్రాజెక్టుల విషయంలో భూసేకరణ చట్టాన్ని అమలు చేసి నిర్వాసితులకు అన్నీ అందించామని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు తెలిపారు. 'మూసీలో నది అభివృద్ధిలో పేదల ఇళ్లు ఎక్కువగా పోతున్నాయి. పాత ఇంటికి భూసేకరణ చట్టం ప్రకారం నష్ట పరిహారం ఇవ్వాలి' అని డిమాండ్‌ చేశారు. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలను, కేంద్ర ప్రభుత్వాన్ని
మోసం చేస్తున్నారని మండిపడ్డారు.


'హైడ్రా కూల్చిన ఇళ్ల సంగతి ఏంటి?' అని హరీశ్‌ రావు ప్రశ్నించారు. 'కొత్తగా ఇళ్లు కూల్చమని ఆదేశిస్తున్నారు. అసలు చట్టం తెలియకుండా మూసీలో ఇల్లు కూల్చారు. రేవంత్ రెడ్డి రాష్ట్ర పరువు తీస్తున్నారు' అని మండిపడ్డారు. 'సోనియాగాంధీపై ప్రేమ ఉంటే 2013 భూసేకరణ చట్టాన్ని రేవంత్‌ రెడ్డి అమలు చేయాలి' అని సవాల్‌ విసిరారు. మూసీ బాధితుల సమస్యలపై తాను చర్చకు సిద్ధమని ప్రకటించారు. మూసీపై అఖిలపక్షం సమావేశం పెట్టాలని రేవంత్‌ రెడ్డికి డిమాండ్‌ చేశారు.


'మూసీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం. మూసీ బాధితుల పక్షాన న్యాయస్థానానికి వెళ్తాం. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మూసీ పనుల్లో రేవంత్‌ రెడ్డి భూసేకరణ చట్టం అమలు చేస్తే తాను స్వయంగా రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లి బొకే ఇచ్చి థాంక్స్ చెప్తా' అని హరీశ్ రావు తెలిపారు.





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.