Kalyana Lakshmi: 'తులం బంగారం ఏది?' అంటూ మహిళ నిలదీత.. ఖంగుతిన్న ఎమ్మెల్యే

Big Shock To Congress MLA Maloth Ramdas Nayak On Thulam Bangaram: బంగారం ధర భారీగా పెరగడంతో మహిళలు కల్యాణలక్ష్మి కింద ఇస్తామన్న 'తులం బంగారం'పై ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. ఓ మహిళ ముఖం మీదనే నిలదీయడంతో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఖంగుతిన్నాడు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 27, 2024, 07:03 PM IST
Kalyana Lakshmi: 'తులం బంగారం ఏది?' అంటూ మహిళ నిలదీత.. ఖంగుతిన్న ఎమ్మెల్యే

Kalyana Lakshmi Gold: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడంతో ఎక్కడికక్కడ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు నిలదీస్తుండడంతో నియోజకవర్గాల్లో పర్యటించలేని పరిస్థితి. ఈ క్రమంలోనే ఓ ఎమ్మెల్యే క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లగా అతడి తీవ్ర పరాభవం జరిగింది. ఓ మహిళ ఎమ్మెల్యేను ధైర్యంగా నిలదీశారు. కల్యాణలక్ష్మిలో భాగంగా ఇస్తామని చెప్పిన 'తులం బంగారం ఏది?' అంటూ ప్రశ్నించారు. తులం బంగారం ఇవ్వరా అంటూ ఆమె ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఖంగుతినడంతో అక్కడే ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆమెను చేయి పట్టుకుని పక్కకు నెట్టేయడం తీవ్ర వివాదంగా మారింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

ఇది చదవండి: Telangana BJP: ఢిల్లీకి తెలంగాణ బీజేపీ బృందం.. ప్రధానితో భేటీ తర్వాత కీలక పరిణామాలు?

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామంలోని రైతు వేదికలో బుధవారం సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి వైరా కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ హాజరై లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఓ మహిళ ఎమ్మెల్యేను ప్రశ్నించారు. 'కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన మహిళలకు రూ.2,500 పెన్షన్ ఇవ్వాలి. కల్యాణలక్ష్మి తులం బంగారం' ఏది అంటూ నేరుగా ఎమ్మెల్యేను ఆమె నిలదీశారు. 'తప్పక ఇస్తామమ్మా. ఏమ్మా అట్ల మాట్లాడతావు. తీసుకునేటోళ్లకే ఇంత కోపం ఉంటే.. ఇచ్చేవాళ్లకు ఇంకా ఎంత బాధ ఉండాలి' అని ఎమ్మెల్యే రామదాసు నాయక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది చదవండి: Hyderabad Alert: హైదరాబాద్ వాహనదారులకు బిగ్ షాక్.. ఇకపై హారన్ కొడితే జైలుకే!

 

మరికొన్ని హామీలపై మహిళ నిలదీసే ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆమెను నెట్టి వేశారు. ఒక నాయకుడు చేయి పట్టుకుని ఆమెను వెళ్లగొట్టారు. అనంతరం ఎమ్మెల్యే కార్యక్రమం కొనసాగించగా.. నిలదీసిన మహిళకు మరికొంత మంది మహిళలు తోడుగా నిలిచి నిలదీశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నిలదీశారు. 'మహిళలకు ఉచిత బస్సు పెట్టారని రద్దీ పెరిగినా.. బస్సులు పెంచకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం' అని మహిళలు వాపోయారు. బస్సుల్లో ఎప్పుడూ గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. 

పెద్ద ఎత్తున మహిళలు నిలదీయడంతో వారిని సముదాయిస్తూ 'అన్ని హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని. త్వరలోనే ఇచ్చిన అన్ని హామీలు ప్రభుత్వ నెరవేరుస్తాం' అని ఎమ్మెల్యే చెప్పే ప్రయత్నం చేస్తూ అక్కడి నుంచి తుర్రుమన్నారు. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ పరిణామంపై బీఆర్‌ఎస్‌ పార్టీ స్పందించింది. 'కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడింది. దానికి తనికెళ్లలో జరిగిన సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ' అని గులాబీ పార్టీ నాయకులు చెబుతున్నారు. 'ఇప్పటికైనా తులం బంగారం ఇవ్వాలి' అంటూ డిమాండ్‌ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News