Telangana BJP: రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్న క్రమంలో తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులు ఢిల్లీ పర్యటన చేపట్టడం కలకలం రేపుతోంది. ప్రధాని మోదీతో సమావేశం తర్వాత కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయని చర్చ జరుగుతోంది. 8 మంది ఎంపీలు.. 8 ఎమ్మెల్సీలు.. ఒక ఎమ్మెల్సీ ప్రధాని మోదీతో సమావేశమయ్యేందుకు ఢిల్లీ బయల్దేరారు. పార్టీలో విబేధాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. దీనికితోడు దేశవ్యాప్తంగా బీజేపీ బలం చేకూరుతుండడం.. జమిలి ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో ప్రధానితో తెలంగాణ నాయకత్వం సమావేశం కానుండడం చర్చనీయాంశంగా మారింది. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతున్న క్రమంలో ఏమైనా కీలక చర్యలకు అధిష్టానం ఆదేశించనుందా? అనేది జోరుగా చర్చ నడుస్తోంది.
ఇది చదవండి: Hyderabad Alert: హైదరాబాద్ వాహనదారులకు బిగ్ షాక్.. ఇకపై హారన్ కొడితే జైలుకే!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ప్రజాప్రతినిధులు ఉమ్మడిగా దాదాపుగా ఇప్పటివరకు సమావేశం కాలేదు. తొలిసారి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కలిసి సంయుక్తంగా ప్రధానితో సమావేశం కానుండడం విశేషం. ప్రస్తుతం రాష్ట్ర పార్టీలో నాయకత్వం మధ్య విబేధాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని తెలుస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు వారిలో వారే గ్రూపులుగా విడిపోయారని చర్చ జరుగుతోంది.
ఇది చదవండి: Telangana: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. హైదరాబాద్‌కు దిగ్గజ సంస్థతో వెయ్యి ఉద్యోగాలు
కొందరు కాంగ్రెస్ ప్రభుత్వంపై మెతక వైఖరితో వ్యవహరిస్తుండడం.. మరికొందరు రాష్ట్ర నాయకత్వానికి సమాచారం లేకుండా దూకుడుగా వెళ్తుండడం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లిందని సమాచారం. దీనికి తోడు రాష్ట్ర అధ్యక్ష పదవి మార్పు హాట్ టాపిక్‌గా మారింది. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో అతడిని అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారనే టాక్ వినిపిస్తోంది. తదుపరి అధ్యక్షుడు ఎవరు అనేది ఉత్కంఠ నెలకొంది.
అధ్యక్ష పదవి కోసం నాయకుల మధ్య తీవ్ర పోటీ ఏర్పడడంతోపాటు నాయకుల మధ్య విబేధాలు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వాన్ని చక్కదిద్దడంతోపాటు అధ్యక్షుడి ఎన్నిక చేపడతారని సమాచారం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపొందేలా రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేస్తారని కూడా తెలుస్తోంది. రాష్ట్ర నాయకత్వంతో ప్రధాని నేరుగా మాట్లాడనుండడంతో త్వరలోనే తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.