Harish Rao:  కాంగ్రెస్‌తో కుమ్మక్కై టికెట్‌ ఇచ్చిన తర్వాత పార్టీకి రాజీనామా చేయడంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా పరిగణించారు. కారు గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి రాజీనామా చేయాలని సవాల్‌ విసిరారు. దమ్ముంటే రాజీనామా చేసి పోటీ చేయాలని డిమాండ్‌ చేశారు. పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరికి గట్టిగా గుణపాఠం చెప్పాలని ప్రజలకు, బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడూ కూలుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా సోమవారం వరంగల్‌ పార్లమెంట్‌ సెగ్మెంట్‌పై హరీశ్‌ రావు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KTR Vs Kishan Reddy: గాలికి గెలిచిన కిషన్‌ రెడ్డికి ఈసారి ఓటమే.. ఇదే నా ఛాలెంజ్‌: కేటీఆర్‌


 


వరంగల్‌లో జరిగిన ఈ సమావేశంలో హరీశ్‌ రావు మాట్లాడుతూ.. కడియం శ్రీహరి, కావ్యలపై మండిపడ్డారు. వాళ్లిద్దరూ పార్టీని వీడిన తర్వాత పార్టీ కార్యకర్తల్లో జోష్‌ కనిపిస్తోందని తెలిపాఉ. పార్టీకి ద్రోహం చేసిన కడియం శ్రీహరికి గుణపాఠం చెప్పాలనే కసి అందరిలో కనిపిస్తోందని పేర్కొన్నారు. బిడ్డకు ఎంపీ టికెట్‌ తీసుకుని అందరితో సమావేశాలు పెట్టి ఆఖరిలో పార్టీ మారిన ద్రోహులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. తండ్రి కూతురు కార్యకర్తల మనోస్థైర్యం, పార్టీని అవమానించారని మండిపడ్డారు.

Also Read: KCR Press Meet: 'కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యిని వెలిగించడానికి రాదా?' రేవంత్‌కు మాజీ సీఎం కేసీఆర్‌ ఆగ్రహం


 


'కడియం శ్రీహరికి బీఆర్‌ఎస్‌ పార్టీ ఏం తక్కువ చేయలేదు. ఉప ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ, ఎంపీగా పార్టీ అవకాశాలు ఇచ్చింది. తల్లిబిడ్డ జీవితాంతం పార్టీకి రుణపడినా తక్కువే. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా కానీ పార్టీ మారనని చెప్పిన ఇప్పుడు ఏమని చెబుతారు? నీతి, నిజాయతీ, విలువలు ఉంటే ఎమ్మెల్యే పదవికి కడియం శ్రీహరి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నా' హరీశ్ రావు సవాల్‌ విసిరారు. రేవంత్‌ రెడ్డిని పలుమార్లు దొంగ అని చెప్పిన కడియం శ్రీహరి చివరికి అతడితోనే కండువా వేయించుకున్నారని గుర్తు చేశారు. ఈ వయసులో ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎప్పుడూ కూలుతుందో తెలియని పరిస్థితి అని హరీశ్ రావు సందేహాలు వ్యక్తం చేశారు. చరిత్ర చూస్తే ఏ రాష్ట్రంలో ఐదేళ్లు పరిపాలించింది లేదని గుర్తు చేశారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook