Heavy rain floods in Khammam: తెలంగాణలో కుండపోతగా వర్షంకురుస్తుంది. ఇప్పటికే ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులన్ని, నదులు నిండుకుండలుగా మారిపోయాయి. కాలనీల్లో, ఇళ్లలోకి నీళ్లు వచ్చిచేరిపోతున్నాయి. సామాన్య జనజీవనమంతా అస్తవ్యస్తంగా మారిపోయిందని చెప్పుకొవచ్చు. ఎక్కడ చూసిన కూడా రోడ్లపై నీళ్లు వస్తున్నాయి. చెరువులకు గండి పడటం వల్ల... జాతీయ రహాదారులు సైతం మునిగిపోతున్నాయి.  రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయడం ఏర్పడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో తెలంగాణలోకి ఖమ్మం జిల్లాలో 110 గ్రామాలు ముంపుకు గురయినట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. అమిత్ షాద్రుష్టికి తీసుకెళ్లిననట్లు తెలుస్తోంది. దీంతో ఆయన  ఖమ్మం జిల్లా పరిస్థితిపై ప్రత్యేకంగా ఆరాతీశారు. ఖమ్మంలోని పలుగ్రామాలు పూర్తిగా జలదిగ్భందంలో ఉన్నట్లు తెలుస్తోంది.


ఖమ్మం జిల్లాలో 110 గ్రామాలు ముంపుకు గురవడంతోపాటు పట్టణంలోని ప్రకాశ్ నగర్ గుట్టపై 9 మంది, పాలేరు నియోజకవర్గంలోని అజ్మీరాతండ గుట్టపైన 68 మంది, బిల్డింగులపైన 42 మంది చిక్కుకున్న విషయాన్ని అమిత్ షాకు బండి సంజయ్ వివరించారు. తెలంగాణలో ప్రాణ నష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఎన్డీఆర్ఎఫ్ ను  అమిత్ షా ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపట్టాలని ఎన్డీఆర్ఎఫ్ కు అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు.


Read more: West benagal: వెస్ట్ బెంగాల్ లో మరో ఘోరం.. సెలైన్ పెడుతుండగా రెచ్చిపోయిన పెషెంట్.. నర్సును బలవంతంగా..


చెన్నై, వైజాగ్, అసోం నుండి 3 చొప్పున మొత్తం 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తెలంగాణకు పంపినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం..  ఎన్డీఆర్ఎఫ్ ఉన్నతాధికారులతో కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడినట్లు సమాచారం.  అదే విధంగా.. రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.