Heavy Rain in Hyderabad: ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టుగా హైదరాబాద్‌లో కుండపోత వర్షం
Heavy Rain Lashes Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షానికి నిమిషాల వ్యవధిలోనే రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రెండురోజుల క్రితం సికింద్రాబాద్‌లో జరిగిన మౌనిక దుర్ఘటన దృష్ట్యా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు.
Heavy Rain Lashes Hyderabad: హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ నలుమూలలా కుండపోతగా కురిసిన కుంభవృష్టి వర్షానికి నగరం తడిసి ముద్దయింది. పంజాగుట్ట, సోమాజీగూడ, ఖైరతాబాద్, కోఠి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎర్రమంజిల్, అమీర్‌పేట, మూసాపేట, కూకట్‌పల్లి, బాలానగర్, జీడిమెట్ల, ప్రగతి నగర్, చందానగర్, శేరిలింగంపల్లి, బీహెచ్ఈఎల్, గచ్చిబౌలి, కొండాపూర్, మెహిదీపట్నం, ఎల్బీనగర్, హయత్ నగర్, దిల్‌షుక్ నగర్, నాగోల్, ఉప్పల్, బోడుప్పల్, ఘట్ కేసర్, హబ్సీగూడ, తార్నాక, నాచారం, ఈసీఐఎల్, కీసర, బోయినపల్లి, ఆల్వాల్, మేడ్చల్ ఇలా నగరం నలుమూలలా కుంభవృష్టి వర్షం కురిసింది.
భారీ వర్షానికి నిమిషాల వ్యవధిలోనే రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రెండురోజుల క్రితం సికింద్రాబాద్‌లో జరిగిన మౌనిక దుర్ఘటన దృష్ట్యా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడెక్కడైతే మ్యాన్ హోల్స్ ఉన్నాయో.. ఆయా చోట్ల జీహెచ్ఎంసీ సిబ్బందిని నియమించి లోతట్టు ప్రాంతాల్లో సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.
రోడ్లపైకి మోకాల్లోతుకుపైగా వరద నీరు వచ్చి చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలోని అన్ని లోతట్టు ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో చాలా చోట్లా భారీగా ట్రాఫిక్ స్థంభించింది. ఉద్యోగాలు ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చే వారిని ఈ ట్రాఫిక్ జామ్ తీవ్ర ఇబ్బందులపాలు చేసింది. ఆదివారం కావడంతో సరదాగా నగరంలో షికార్లు కొడదాం అని బయటికి వచ్చిన వారు సైతం ఇబ్బందులపాలయ్యారు. ఇళ్లలో ఉన్న వాళ్లు ఎంతో అత్యవసరం అయితే, ఇంటి నుంచి బయటికి రావొద్దని ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు.